Papaya Benefits: బొప్పాయి సర్వరోగ నివారిణిఅని నిపుణులు తెలియజేశారు. దీనిలో విటమిన్ A, B, C, D అధికంగా ఉంటాయి.
ఈ పండులో పెప్సన్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
ఈ పండు తరచుగా ఆహారంలో తీసుకుంటే ఉదర సంబంధమైన జబ్బులను నయం చేయడంలోని బొప్పాయి సమృద్ధివంతంగా పనిచేస్తుంది.
మానవ శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే అలాంటి జబ్బులు రాకుండా చేయాలన్న, వచ్చిన జబ్బులను మాటు మాయం చేయాలన్న తరచూ బొప్పాయి పండును ఆహారంలోకి సేవించాలంటున్నారు వైద్యులు.
ఎందుకంటే ఉదరం లోని ప్రేగులు శుభ్రం అయితే శరీరం పూర్తిగా శుభ్రం అయినట్టే లెక్క ఎప్పుడైతే పేగులు శుభ్రపడతాయో శరీరం ఉల్లాసంగా తయారై తన పని తను చేసుకుంటూ పోతుంది.
మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్ళను శుభ్రం చేసే శక్తి బొప్పాయిలో ఉంటుంది .బొప్పాయిలో మినరల్స్ ,పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి.
దీనిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ అధిక బరువును తగ్గించడంలో సహకరిస్తుంది .కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల వచ్చే జబ్బుల లను కూడా నయం చేయడం లో ఈ బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బొప్పాయి ఆకుల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చిన వారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే రక్తంలో ప్లేట్ రేట్లు పెరిగి రక్తం వృద్ధి చెందుతుంది.
త్వరగా జ్వరం నుండి కోలుకుంటారు కూడా బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే మధుమేహం తగ్గుతుంది.శరీరంలో ఉండే షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి .జాండీస్, లివర్ వ్యాధులు వచ్చిన వాళ్లు రోజు ఈ రసాన్ని తాగితే త్వరగా కోలుకుంటారు .గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్ రాకుండా ఉండటానికి కూడా ఈ రసం బాగా ఉపయోగపడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in