Heart AttackHeart Attack
0 0
Read Time:7 Minute, 51 Second

Heart Attack: గుండెపోటు ప్రపంచంలోనే ఏ జంతువుకి రాని గుండెపోటు మనిషికే ఎందుకు వస్తుంది. ఇది మనిషి చేసిన తప్పుల వల్లే ఈ గుండెపోటు వస్తుంది.
ముసలివారే కాక యువత కూడా ఈ గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది మరణాలలోని గుండెపోటు ఒకటి.


గుండెకు వచ్చే రకరకాల సమస్యల వల్ల గుండె ఆగిపోవడానికి కారణం అవుతుంది. ఈమధ్య 20 నుండి 25 సంవత్సరాల యువత కూడా గుండెపోటు చనిపోతూ ఉన్నారు.
అసలు 60 సంవత్సరాలు పైబడిన వారికి రావలసిన హార్ట్ ఎటాక్ అంతా చిన్న వయసులో ఉండేవారికి రావడం చాలా బాధాకరం.


ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచ జనాభా లో అనారోగ్యంగా చనిపోయే వారిని తీసుకుంటే 50% మరణాలు కేవలం గుండె జబ్బు వల్ల ,మిగతా జబ్బులు అన్నీ కలిసిన సగభాగం జనాన్ని చంపట్లేదు.


కానీ గుండె జబ్బు ఎక్కువ మందిని చంపేస్తుంది. అలాంటి హార్ట్ ఎటాక్ ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం, ఎప్పుడు మనం ప్రాణం పోతుందో చెప్పలేం, ప్రాణం పోయినప్పుడు మనల్ని నమ్ముకున్న వారు ఎంత బాధ పడతారు.


కాబట్టి ఇలాంటి ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండాలంటే మూడు ముఖ్యమైనవి సూత్రాలు పాటిస్తే సరి.

మొదటిది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటం మంచి కొలెస్ట్రాల్ తగ్గడం దీనివల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి బ్యాడ్ కొలెస్ట్రాల్, రక్తంలో triglycerides ఈ రెండు గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి కారణం అవుతున్నాయి.


అసలు ఈ triglycerides రక్తంలో పెరగడానికి గల కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్(LDL) మరియు triglycerides ఈ రెండు పెరగడానికి గల కారణం blood vessels లు హార్డ్ అయిపోవడం వల్ల ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి చివరిలో ,అంచుల్లో కూడా ఈ కొవ్వు పేరుకుపోతుంది.
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోయి గట్టిగా హార్డ్ గా ముడుచుకుపోతుంటాయి.


కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో పూడికలు చేస్తుంది. ఈ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అనేది రక్త ప్రసరణ జరగడానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది.


రక్త ప్రసరణ జరగకపోతే ఆ బాగాలన్నిటికీ గాలి ,నీరు ,ఆహారం అందక ఆ భాగాలు డ్యామేజ్ అయిపోతాయి. అందువల్ల ఆ భాగాలు చనిపోతాయి.


ఏ భాగానికి అయినా ముఖ్యంగా గుండెల్లో, రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. అసలు ఆ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు వస్తుంది.


అంటే ప్రధానంగా వైట్ ప్రొడక్ట్స్ తినడం వల్ల వస్తుంది అసలు నాన్ వెజ్ తినడం కంటే ఎక్కువ ప్రమాదం వైట్ ప్రొడక్ట్స్ తినడం అంటే తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ ,తెల్లటి పిండి, తెల్లటి మైదా, ఇలాంటి వాటితో తయారుచేసిన ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, టిఫిన్స్, మరియు స్నాక్స్ ,స్వీట్స్, హాట్స్ వీటన్నిటిని వైట్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తున్నాము.
రుచిగా ఉన్నాయి అని అతిగా తినడం వల్ల ఎక్కువ తినేస్తున్నాము.

దీనివలన బ్లడ్ లో triglycerides ను పెంచుతాయి బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతున్నాయి.
ఎక్కువ ప్రాణాంతకమైన గుండె జబ్బులు రావడానికి కారణం వైట్ ప్రొడక్ట్స్ వీటి విషయంలో మీరు జాగ్రత్త పడటం మంచిది.

వైట్ ప్రొడక్ట్స్ మానేసి దీని బదులు పాలిష్ పట్టకుండా ముడి రవ్వలు, ముడి బియ్యం ,ముడి పప్పులు, ముడి ధాన్యాలు తీసుకోండి. ఇలాంటి వాడినప్పుడు పనికి తగ్గట్టు ఆహారం తీసుకోవాలి.


జనాలు ఏమిటంటే పని చేయడం తగ్గిపోయినా కూడా ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు. అవసరం తగ్గట్టే ఆహారం తీసుకోవడం మంచిది.

అప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఏర్పడడం జరగదు.దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి హార్ట్ ఎటాక్ అనేవి రాకుండా ఉంటాయి.ఇది మొట్టమొదటి సూత్రం.


ఇంకా రెండవ కారణం సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం. రుచిగా ఉంటుంది.అని ఎక్కువగా సాల్ట్ ని తీసుకోవడం వల్ల మనం తిన్న ఉప్పు అంతా బ్లడ్ లోనికి వెళ్లి అంచుల అంట వెళ్లి రక్తనాళాలు గోడలకు పట్టేసి రక్తనాళాలు గోడలు గట్టి పడేటట్లు చేస్తుంది ఇలా ముడుచుకొని సాగాల్సిన రక్తనాళాలు హార్డ్ గా తయారవుతున్నాయి.


ఆ రక్తనాళాలు హార్డ్ అయిపోతే ఆ గట్టిపడ్డ రక్తనాళాలు గుండె పంపు కొట్టాలి అంటే గుండె భారం అయిపోతుంది.

గుండె పంపు చేయలేక రక్తనాళాల్లో ఉప్పు పేరుకుపోవడం వల్ల congestive heart failure అయ్యి గుండె ఆగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ఉప్పును వీలైనంత తగ్గిస్తే మంచిది.
మూడవది high బిపి వల్ల హార్ట్ ఎటాక్ ఎక్కువగా రావడానికి కారణం హైబీపీ వల్లే ఎందుకంటే high బిపి వచ్చినప్పుడు మన రక్తనాళాలు ఏమవుతాయి అంటే సంకోచ వ్యాకోచనాలు తగ్గి బీపీ వల్ల రక్తనాళాలు ముడ్చుకుపోయి సాగే గుణాన్ని కోల్పోతాయి.

ముడుచుకుపోయిన రక్తనాళాల్లో పంపు కొట్టలేదు కనుక హాట్ ఫెయిల్యూర్ అవుతాయి. అందుకే బీపీ ఎప్పుడు కూడా120/80 కంటే తక్కువ ఉంటే మంచిది.

100/70 మరియు110/70 ఉంటే మంచిది. మీ బిపి100/70 ఉంటే మీ గుండె బాగా పనిచేస్తుందిఅని అర్థం.మన బీపీ ఎప్పుడూ నార్మల్ గా ఉండాలి.

బీపీ ఉన్నవాళ్లు ఏది పడితే అది తినేసి మందులు వేసుకోకుండా ఉంటే అన్ కంట్రోల్ బిపి ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది .


కాబట్టి బీపీ అసలు రాకుండా చూసుకోండి. వస్తే డాక్టర్ సలహా తీసుకుంటూ పూర్తి ఆరోగ్యంగా ఉండండి.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *