Ugadi 2024:ఉగాది తెలుగు వారికి అత్యున్నత ప్రీతి అయిన ఉగాది.2024వ సంవత్సరం ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది.ఏ తేదీన జరుపుకోవాలి.
ఈ సంవత్సరం మనకు తెలుగు కొత్త సంవత్సరం పేరు ఏమిటి? ఉగాది రోజున చెయ్యవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ప్రతి ఒక్కటి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది అనే పదం యుగాది సంస్కృత పదం నుండి వచ్చింది.
నూతన ఉత్సాహానికి నాంది తెలుగు వారికి ఉగాది పండుగ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించారు.
అని మన పురాణాల్లో చెప్పబడుతున్నది.ఈ ఉగాది పండుగకు చాలా పెద్ద విశిష్టత ఉంది.త్రేతా యుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ ఉగాది పండుగ రోజునే అని పురాణాలు చెబుతున్నాయి.
మరో కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలు దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యవతారంలో వెళ్లి సోమకారున్ని వధించి వేదాలను బ్రహ్మ దేవునికి అప్పగించినది కూడా ఈ ఉగాది రోజునే.
ఉగాది రోజు నుండి మనకు తెలుగు కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. తెలుగు వారు అందరూ కూడా ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని కొత్త బట్టలు ధరించి ఎంతో వేడుకగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఏదైనా సరే కొత్త పనులను ప్రారంభం అనేది ఈ రోజునే జరుపుకుంటారు.
ఉగాది పండుగ రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది ప్రత్యేకించి దేవి శరవరాత్రులు అమ్మవారి ఏ విధంగా పూజలు చేస్తారో అలాగే ఈ ఉగాది రోజు నుంచి మనకు వసంత నవరాత్రులు ప్రారంభమై అవుతాయి.
ప్రత్యేకంగా లలితా దేవిని పూజిస్తారు. అలాగే ఈ ఉగాది రోజు నుంచి 9 రోజులు మనము శ్రీరాముడు నవరాత్రులు లాగా రామ రామ జపం రామ నవరాత్రులు లాగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఈ ఉగాది రోజున పారాయణం అనేది ప్రారంభంచవచ్చు. అంటే రామాయణం చదవటం,సుందరకాండ చదవడం,భగవద్గీత చదవటం అలా ప్రత్యేకించి పారాయణం లాంటివి చదవడం ప్రారంభిస్తారు.
ఈ ఉగాదికి వేప పూత అనేది ఏర్పడుతుంది. ఈరోజు తప్పకుండా ఉగాది పచ్చడి తప్పక తినాలి అని మన శాస్త్రం చెబుతుంది. విశిష్టమైన ఉగాది పండుగ 2024 సంవత్సరంలో ఉగాది రోజున కొత్త తెలుగు సంవత్సరం పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
పాడ్యమి తేదీ విషయానికొస్తే మనకు చైత్ర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 2024 సంవత్సరంలో చైత్ర మాసం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది.
పాడ్యమి తిధి ఏప్రిల్ 8 సోమవారం అర్ధరాత్రి 12 గంటల 19 నిమిషాల నుంచి ఏప్రిల్ 9 మంగళవారం రాత్రి 10 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది నక్షత్ర రేవతి నక్షత్రం ఉదయం 8: 35 వరకు తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభం.
2024వ సంవత్సరంలో ఉగాది పండగ ఏప్రిల్ 9 మంగళవారం రోజున జరుపుకుంటారు. అలాగే షడ్రుచులతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి అంటే తీపి,కారం, పులుపు వగరు చేదు,ఉప్పు అలా అన్నిటి కలయికనే ఉగాది పచ్చడి గా చేసి ఇంటిల్లిపాది తిని ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in