Water Bottle:మనం ఈరోజుల్లో ఎక్కువగా వినే ప్రాబ్లం థైరాయిడ్. హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఈ రెండు వస్తున్నాయి. దానితోపాటు (pcod )(pcos)సక్రమంగా రుతుక్రమ రాకపోవడం గర్భసంచిలో గడ్డలు రావడం అలాగే( CKD) (Chronic kidney disease) రోజు రోజుకి ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. డయాబెటిక్ ఏ రేంజ్ లో ఉందో దానికన్నా డబల్ స్పీడ్ తో సి కె డి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్మోకింగ్ ఉండదు, డ్రింకింగ్ ఉండదు. బయట పాన్ తినడం ఉండదు, బయట ఫుడ్ కూడా తినరు. అటువంటి వారికి కూడా చిన్నపిల్లలకు కూడా వస్తుంది.10 ,15 సంవత్సరాల పిల్లలకు కూడా సికేడి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ వారికి షుగర్ గానీ, బిపి గానీ ఉండదు. కానీ కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిపోతుంది. అలాగే గ్యాస్టిక్ క్యాన్సర్ అంటే పొట్టలోని క్యాన్సర్ రావడం,అలాగే పెద్ద ప్రేగులు సంబంధించిన క్యాన్సర్ రావడం, వంటివి వస్తున్నాయి అసలు ఎందుకు వస్తున్నాయో తెలుసా! మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల ప్లాస్టిక్ బాటిల్స్ ,కంటైనర్ లో స్టోర్ చేసి వాటర్ ని తాగడం వల్ల సహజంగా దొరికే వాటర్ కలుషితం అయిపోతుంది.
అందరూ ప్లాస్టిక్ బాటిల్స్ మరియు కంటైనర్స్ వాటర్ వాడడం వల్ల ఆ ప్లాస్టిక్ నుంచి మైక్రోప్లాస్టర్స్ అనే పదార్థం బయటకు రావడం వల్ల ఆ వాటర్ మనం త్రాగడం వల్ల అది కడుపులోకి వెళ్లి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో ప్లాస్టిక్ చేస్తే పర్వాలేదు. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ పలచగా ఉండదు గట్టిగా ఉంటుంది. అటువంటి ప్లాస్టిక్ ని వాడవచ్చు. అందరికీ ట్రావెలింగ్ లో ఈజీ అని అందరూ వాటర్ బాటిల్ లను కొని త్రాగుతున్నారు. తర్వాత ఆ బాటిలను పడేస్తారు.ఆ తరువాత ఆ బాటిల్ రీసైకిల్ అవుతుంది. అసలు బాటిల్లో వాటర్ త్రాగి పడేసేటప్పుడు బాగా నలిపి పడేయాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే బాటిల్ కొనుక్కొని వాటర్ తాగి మళ్లీ వాటర్ వేసుకొని వాడుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ వాడబట్టే మీరే స్వయంగా క్యాన్సర్‌ను కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుంది. అందుకే ఫస్ట్ మనం ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ను తాగడం పూర్తిగా మానేయండి. దీని బదులు శ్రమ అనుకోకుండా ఇంట్లో వాడే వాటర్ ని స్టీల్ బాటిల్లో లేదా కాపర్ బాటిల్లో నింపి వాడండి. ఇప్పుడైతే ఫంక్షన్స్ లో గ్లాసుతో వాటర్ పెట్టడం మానేసి ప్లాస్టిక్ బాటిల్ తో వాటర్ పెడుతున్నారు. అలా తాగితే మీకు హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్యూర్ కాక ఇంకేం అవుతుంది. ఆలోచించండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడడం పూర్తిగా మానేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in