Betel Leaf Health Benefits:తమలపాకు వల్ల ప్రయోజనాలు తమలపాకును తాంబూలాలలోని లేదా కిల్లిలో ఉపయోగిస్తారు అని మాత్రమే అందరికీ తెలుసు.
తమలపాకు ప్రయోజనాలు:భోజనం చేసిన తరువాత తమలపాకుతో చేసిన తాంబూలం తింటే ఆహారం త్వరగా అరిగిపోతుంది. అని అందరికీ తెలుసు.
తాంబూలం అంటే అరుగుదలకు నోరు పండడానికి మాత్రమే కాదు పంటి దంతాలు గట్టి పడతాయి చిగుళ్ళు వాపు తగ్గడానికి ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. ఆ తాంబూలం ఉన్న సున్నం వల్ల కాల్షియం వస్తుంది.
దీనివల్ల ఎముకలు గట్టి పడతాయి. తమలపాకు వల్ల డైజేషన్ చాలా బాగుంటుంది ఏమి తిన్నా అరిగిపోతుంది. చాలా మందికి అరగట్లేదు గ్యాస్ ఫామ్ అయిపోతుంది.
అనే వారు తాంబూలం తీసుకుంటే సరి. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. తాంబూలం ఎప్పుడు నెమ్మదిగా బాగా నమిలి తినాలి అప్పుడే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది.
త్వరగా తింటే మోషన్ లో వచ్చేస్తుంది దాని వల్ల ఉపయోగం ఉండదు. ఆకలి వేయకపోయినా, రుచి లేకపోయినా రెండు తమలపాకుని బాగా నమిలి తినండి.
అలాగే మైగ్రో హెడేక్స్ తలనొప్పి గానీ ఉన్నవారు తమలపాకు నమలడం వల్ల దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
తమలపాకు ఉపయోగం:అలాగే తమలపాకులు బాగా నూరి దాని నుంచి వచ్చే రసాన్ని తలనొప్పి గానీ మైగ్రో హెడ్ ఏక్ ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో
అక్కడ ఈ రసాన్ని రాసి మర్దన చేసిన లేదా తమలపాకు కు ఆముదాన్ని రాసి ఆకును వేడి చేసి తలపై పెట్టిన వెంటనే బాధ తగ్గుతుంది.
అలాగే దగ్గు జలుబు ఉన్నవారు చాతి మీద ఆవనునే కానీ ఆముదం కానీ వేడి చేసి చాతి మీద వేసి దానిపై తమలపాకు అద్దండి. జలుబు,దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి.
తమలపాకు వేళ్ళను తుంచి పేస్టిగా చేసి దానిని తీసుకుంటే దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది.
తమలపాకులను నీటిలో వేసి వేడి చేసి ఆ తమలపాకులను ఒక క్లాత్ లో కట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆ క్లాత్ ని నొప్పి ఉన్నచోట కట్టులా కట్టుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి
ఇలా వేడి చేసిన తమలపాకు వాటర్ లో పటిక బెల్లం తీసుకొని తాగితే ఆస్తమా లాంటివి కూడా తగ్గుతాయి.
నేతిలో తమలపాకు వేయించి ఆ తమలపాకు తింటే వాతం లాంటివి తగ్గుతాయి. కనుక తమలపాకును స్వయంగా తిన్నా లేదా తాంబూలంలో తీసుకున్న చాలా ఉపయోగాలు ఉంటాయి.
శాస్త్రీయ నామం:పైపర్ బెటిల్ (L) సాధారణంగా తమలపాకు వైన్ అని పిలుస్తారు, ఇది పైపెరేసి కుటుంబానికి చెందినది. ఇది ఆసియాలో ప్రసిద్ధ ఔషధ మొక్క.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in