Ragi Chapati:అందరూ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అందరూ వెయిట్ లాస్ కి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
ఈ రాగి చపాతీలు చేయడం చాలా ఈజీ, హెల్దీ ఫుడ్ తినాలి అనుకునే వారికి ద బెస్ట్.
ఈ రాగుల్లో ముఖ్యంగా కార్బోహైడ్రస్, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇది శరీరం కి బూస్ట్ గా పనిచేసి ఎనర్జీ ఇస్తుంది. ముందు తరం వాళ్లు ఎక్కువగా ఇలాంటి ఫుడ్ తీసుకునేవారు కాబట్టే స్ట్రాంగ్ గా ,ఎనర్జిటిక్ గా ఉండేవారు.
రాగి రొట్టెలకు బదులు ఈరోజు రాగి చపాతీలను తినటం మంచిది. ఈ రాగి చపాతీలు చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి చపాతీలు తయారు చేసే విధానం:
ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకొని జల్లించండి తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి ఒక కప్పు నీటిని వేయండి.
ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు నీరు నీటిని, తీసుకోవాలి ఆ నీరు పొంగు వచ్చిన తరువాత పిండి వేసి బాగా కలపండి.
తరువాత స్టవ్ కట్టేసి ఒక నిమిషం పక్కన పెట్టండి. కాస్త వేడి ఉండగానే పిండిని చేతితో చపాతీ పిండిలాగా కలుపుతూ ఉండండి.
దానిలో ఒక స్పూన్ నెయ్యి గాని ఆయిల్ గాని వేసి ఒక పది నిమిషాల వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కలపడం వల్ల చపాతీలు స్మూత్ గా వస్తాయి.
చపాతీ పిండి మాదిరి ముద్దలా చేసుకోండి తర్వాత పొడి రాగి పిండిపై రాగి ముద్దను అద్ది లావుగా కాక సన్నగా కాక మీడియం సైజులో చపాతీ మాదిరి నెమ్మదిగా రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకోండి.
తర్వాత స్టవ్ పై పెనం పెట్టి రాగి చపాతిని పెనంపై వేయండి. మంట హై లోనే ఉండాలి. ముందు వెనకలు బాగా కాల్చుకోండి.
ఆయిల్ మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే మీ ఇష్టం. ఈ రాగి చపాతీలు చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా పొంగుతూ పొరలు పొరలుగా వస్తాయి
వీటిని హాట్ బాక్స్ లోకి తీసుకోండి. దీనిలోకి మటన్ గాని చికెన్ గాని లేక బాయిల్ చేసిన కర్రీస్ బాగుంటాయి.
రాగి చపాతీ ప్రయోజనాలు:
దీనిలో అధిక ప్రోటీన్ సహజ బరువు తగ్గించే ఏజెంట్స్ కలవు దీనిని రోజు తీసుకోవడం వల్ల చర్మాన్ని వృద్ధాప్యం నుండి నివారిస్తుంది.
రాగి తీసుకోవడం వల్ల జుట్టుకు మంచిది.
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది పాలు ఇచ్చే తల్లులు ఈ రాగులు తీసుకోవడం వల్ల తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది.
మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది, పెద్దప్రేగు క్యాన్సర్‌ను రాకుండా చూస్తుంది.
రాగి చపాతీ కేలరీలు:
105 కేలరీలు 100 గ్రాముల పిండికి
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in