Kidney Stones VS Gallbladder Stones:
పిత్తాశయ రాళ్లు జీర్ణ ద్రవం యొక్క నిక్షేపాలు, కిడ్నీల్లో రాళ్ళు మూత్రంలో రసాయనాల నుండి ఏర్పడిన స్ఫటికాలు. కిడ్నీలో రాళ్ళకి పిత్తాశయం రాళ్ళకి మధ్య తేడా ఏమిటి అని తెలుసుకుందాం. కిడ్నీ నొప్పి అనేది రెండు సైడ్లు వస్తుంది. ఎడమ పక్క రావచ్చు.
లేదా కుడిపక్క రావచ్చు. కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పి అనేది రాదు. కిడ్నీలో రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా పడిపోయి యూరినరీ బ్లాడర్ కి అంటే కిడ్నీకి ,యూరినరీ బ్లండర్ కి ఇంచుమించు 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉంటుంది.
ఆ 20 సెంటీమీటర్ల దూరానికి సన్నని నాళం యురేటర్ ఉంటుంది. ఆ కిడ్నీ నుంచి యూరినరీ బ్లెండర్ కి ఆ రాయి పాస్ అయినప్పుడు నొప్పి అనేది వస్తుంది.
అంటే యూరిన్ వచ్చేటప్పుడు మనం నొక్కినప్పుడు రాయి అనేది ఇరుక్కుపోతుంది.
దీనిని రెనల్ కొలిక్ అంటారు.యూరిన్ రావడానికి గట్టిగా రోప్పి నప్పుడు విపరీతమైన నొప్పి మెలితిప్పినట్టు ఉంటుంది. యూరిన్ వచ్చేటప్పుడు నొప్పి వస్తుంది.
తరువాత తగ్గిపోతుంది. దీనిని కొలిక్ అబ్డొమినల్ పెయిన్ అంటారు. ఆ నొప్పి నడుము నుంచి కిడ్నీకి వస్తుంది ఎడమ పక్క వస్తే అది కిడ్నీ నొప్పి అయ్యే అవకాశం ఉంటుంది.
ఆ నొప్పి వెనుక నుండి ముందుకి ప్రాకినట్టు వస్తుంది. అదే కుడిపక్క అనుకోండి పసర సంచి కూడా కుడి పక్కనే ఉంటుంది
కాబట్టి అప్పుడు ఇది పిత్తాశయం రాళ్ల నొప్ప లేదా కిడ్నీ రాళ్ల నొప్పా అని కొన్ని సందేహాలు ఉంటాయి.
స్కానింగ్ లో తెలుస్తుంది. కొంతమంది పేషెంట్ కంప్లైంట్ ద్వారా కూడా డాక్టర్స్ కి తెలుస్తుంది. పసరు నొప్పి కూడా కుడి పక్కన వెనుక నడుం నుండి ముందుకు నొప్పి వస్తుంది.
అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే యూరిన్ మంట వస్తుంది. అదే పసరు సంచిలో రాళ్లు అయితే చాతికి పొట్టకి మధ్యలో రిబ్ కేజ్ ఉంటుంది. అక్కడ నొప్పి వస్తుంది.
కిడ్నీలో రాయి అయితే ఒక సెంటీమీటర్ లోపు ఉన్న రాళ్లు ఆపరేషన్ లేకుండా వాటంత అవే పడిపోతాయి. వాటర్ ఎక్కువ తాగితే రాళ్లు వాటి అంతట అవే పడిపోతాయి.
కాబట్టి ఒక సెంటీమీటర్ లోపు ఉన్న రాళ్లకు ఏ డాక్టర్ ఆపరేషన్ చేయరు. అదే ఒక సెంటీమీటర్ లేదా అర సెంటీమీటర్ ఉన్న రాయి ఒక్కోసారి యూరినరీ సంచుల్లోకి వచ్చే దారిలో ఉరేటర్ అనే సన్నని నాళములో ఇరుక్కుపోతాయి.
చిన్న రాయి అయినా ఇరుక్కుపోవడం వల్ల కిడ్నీ వాపు వచ్చేసి ఉంటుంది. దీనినే హైడ్రో యురేటర్ నేఫ్రోసిస్ అంటారు. కిడ్నీ వాపు వస్తే అప్పుడు దానికి ఆపరేషన్ చేయాలి.
ఇరుక్కుపోవడం వల్ల ఒక్కొక్కసారి నొప్పి తక్కువగా ఉన్నా కిడ్నీ వాపు వల్ల ఫంక్షన్ పాడైపోతుంది. కిడ్నీలో ఒక లీటర్ యూరిన్ తయారు చేస్తుంది.
అది బయటకు రావాలి రాయి నాళo లో ఇరుక్కుపోవడం వల్ల అది బయటకు రాకపోతే కిడ్నీ మెల్లమెల్లగా పాడవుతుంది. అప్పుడు ఆపరేషన్ చేసి రాళ్లు తీయాలి.
కిడ్నీ వాపు లేకపోతే ఒక సెంటీమీటర్ లోపు ఉన్న రాళ్లు ఎక్కువ వాటర్ తాగితే వాటర్ తో పాటే బయటకు వచ్చేస్తాయి. పసరు రాళ్లకు నొప్పి లేకపోతే ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు.
నొప్పి వస్తే మాత్రం ఆపరేషన్ చేయాలి.
ఈ పిత్తాశయం నొప్పి ఆపరేషన్ కి నొప్పి లేకుండా పావుగంటలో చుక్క రక్తం పోకుండా పసరు సంచిలో రాయిని వైద్యులు తేలిగ్గా తీసి వేస్తారు.
కిడ్నీ వాపు వస్తే మాత్రమే ఆపరేషన్ చేస్తారు.
పిత్తాశయం లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా: పసర సంచి రాయి నుండి నొప్పి సాధారణంగా మీ పొత్తికడుపు కుడి ఎగువ భాగంలో ఉన్నప్పుడు, నొప్పి మీ వెనుక లేదా కుడి భుజం నుండి వస్తున్నట్లు అనిపించవచ్చు. మీరు వికారం మరియు వాంతులు అనుభవిస్తున్నట్లయితే, మీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. మూత్రపిండాల్లో రాళ్ల విషయానికొస్తే, మీరు పార్శ్వపు నొప్పిని అనుభవించవచ్చు మరియు మీకు వెన్ను సమస్యలు ఉన్నాయని అని సందేహం రావచ్చు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in