Over heating:శరీరం అతి వేడి కారణంగా ఎన్నో ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. ఇంకా ఎండాకాలంలో అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
దీనికి కారణం మసాలా ఆహారం ఎక్కువగా తినడం, నీరు తక్కువగా త్రాగడం, అదే పనిగా కుర్చీలో పని చేయడం వలన శరీరంలో వేడి ఎక్కువగా అవుతుంది.
దీనివలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. బాడీ వేడిని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం
Step1: ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను ఒక స్పూను, పటికి బెల్లాన్ని వేసి రెండు లేక మూడు గంటలు నానబెట్టాలి. ఆ నీటిని త్రాగడం వల్ల వేడి తగ్గుతుంది.
జీలకర్ర,పటిక బెల్లం కాంబినేషన్ శరీరాన్ని వేడి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
దీనిని మరొక విధంగా కూడా త్రాగచ్చు.
జీలకర్ర, పటికి బెల్లాన్ని మిక్సీలో గ్రైండ్ పెట్టి పొడిగా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఈ పొడిని వేసి త్రాగడం వలన వేడి తగ్గి మూత్ర విసర్జన సమయంలో మంట నొప్పి లాంటివి తగ్గుతాయి.
ఇలా రోజులో రెండు సార్లు తాగితే బాడీ కూల్ అవుతుంది.
Step2: రెండు లేక మూడు స్పూన్ల సబ్జా గింజలను నాలుగు గంటలపాటు నానబెట్టి ఇలా నానిన సబ్జా గింజలకు ఇంకా వాటర్ ని యాడ్ చేసి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి దీనిలో టెస్ట్ కోసం తేనెను కూడా కలుపుకోవచ్చు ఈ వాటర్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
Step3: చిన్నపిల్లలకు చమట మూలంగా చెమట పొక్కులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనెను కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున త్రాగడం వల్ల శరీరం వేడి తగ్గడమే కాకుండా చెమట పొక్కులు కూడా తగ్గుతాయి.
అన్నిటికన్నా ముఖ్యమైనది నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో అతి వేడి అన్నది చక్కగా తగ్గిపోతుంది. మీరు ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ త్రాగడం మంచిది. అలాగే తరచూ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో అతి వేడి అనే సమస్య ఉండదు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in
శరీరం వేడిని తగ్గించే చిట్కాలు
- ఒక స్పూన్ మెంతులను రోజు ఆహారంలో చేర్చుకోవాలి.
- గసగసాల పొడి కలుపుకొని త్రాగడం మంచిది.
- దోసకాయ ముక్కలుగా కోసుకొని తినడం మంచిది.
- దానిమ్మ జ్యూస్ రోజు ఉదయాన్నే త్రాగాలి.
- పలచగా మజ్జిగను చేసుకొని త్రాగాలి.
- పుచ్చకాయ తింటే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది.
- కొబ్బరినీళ్లు రోజుకు రెండు సార్లు కచ్చితంగా త్రాగాలి.
- గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని రోజు త్రాగాలి.
వేడి అలసట యొక్క సిమ్టంస్ మరియు లక్షణాలు:
విపరీతమైన చెమట,చర్మం పాలిపోవటం,కండరాల తిమ్మిరిగా ఉండటం,బలహీనంగా ఉండటం,తల తిరగడం, తలనొప్పి,వికారం, వాంతులు,మూర్ఛపోతున్నది,హై పల్స్.