Srirama Navami 2024:శ్రీరామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత
When is Ram Navami 2024:ఈ సంవత్సరం, రామ నవమి ఏప్రిల్ 17 న వచ్చింది. రామ నవమి అనేది ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ.
ఇది హిందూమతంలో అత్యంత ఆరాధించే దేవతలలో ఒకరైన శ్రీరాముని జన్మదినాన్ని జరుపుకుటారు.
శ్రీ రాముడు శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం అని నమ్ముతారు, దీనిని ‘శ్రీ మహా విష్ణువు ఒక్క మానవ అవతారమే శ్రీ రాము ని అవతారం.
Why Sri Rama Navami is celebrated:శ్రీ రామ నవమి హిందువులకు అత్యున్నత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యున్నత భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.
శ్రీరాముడు వసంత ఋతువు లో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసుల నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతా యుగంలో జన్మించినారు.
ఆ దినమును ప్రజలు పండుగ జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడి సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషేతుడైనాడు.
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసము.
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు.
శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణాల్లో పల్లె పల్లెల్లోని రమణీయంగా జరుపుకోవడం ఓ సాంప్రదాయం.
భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్ల కొలది భక్తుల పూజలు అందుకుంటున్నారు శ్రీరామచంద్రుడు.
చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు పుట్టిన రోజు క్షత్రియుడై, రాజ పాలనలో ఉన్న ప్రభువుకు పుట్టినరోజు నాడే కళ్యాణం జరిపించే ఆచారం ఆ రోజుల్లో ఉంది అంట.
ఆ ప్రకారం రామనవమి రోజే సీతారామ కళ్యాణం జరిపారు అంట.
శ్రీరామనవమి విశిష్టత:
దశావతారంలో శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారంగా రావణ సంహారార్థమై శ్రీరాముడు 14 సంవత్సరముల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీత సమేతంగా అయోధ్యకు ఈ రోజే వచ్చారు.
శ్రీ రామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయించిన, చూసిన సకల శుభాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు చేకూరుతాయి.
సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంట.
శ్రీరామచంద్రున్ని తెలుగువారు ప్రతి ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు. నేటికీ భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది.
భద్రాచలంలో రంగ రంగ వైభవంగా కనుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తారు.
కళ్యాణం లో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందుతారు.
భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లుగా,
అయితే తను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామచంద్రుని పుట్టినరోజు వేడుకలు ,కళ్యాణ వేడుకలు ఒకే సారి జరిపించారు.
శ్రీ సీతారామ కళ్యాణము, రాములవారు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీ రామ నవమి రోజే, శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది.
శ్రీరాముడు సత్య పాలకుడు ధర్మచారణం తప్పనివాడు ఏకపత్నివ్రతుడు. పితృ ,మాతృ సదాచారం విగ్రహం సర్వ సుగుణాలు మూర్తిభవించిన దయాంత హృదయుడు.
శ్రీ రామ నవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుణ్ణి, ఆంజనేయ సమేతంగా ఆరాధించి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు.
ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్ధకం చెందుతుందన్నది భక్తుల విశ్వాసం.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in