Benefits Of Basil Seeds:సబ్జా గింజలు అంటే అందరూ చలువకు మాత్రమే వాడుతారు అని అనుకుంటున్నారు. దానితో పాటు సబ్జా గింజలతో వైరస్ లక్షణాలను కూడా చెక్ పెట్టొచ్చు అని మీకు తెలుసా.
basil seeds benefits
సబ్జా గింజలను ఉపయోగించి వైరస్ తాలూకు వచ్చే సింటమ్స్ ను, తీవ్రతను వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఈ సబ్జా గింజలను ఇంగ్లీషులో Basil seeds అంటారు.
ఇవి చూడటానికి నల్లగా చిన్నగా గుండ్రంగా లేక ఒవెల్ ఆకారంలో ఉంటాయి. వీటిలో dietary fibres ఎక్కువగా ఉంటాయి.
దీనిలో విటమిన్ K,విటమిన్ A,ఐరన్ ,ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. దీనిలో Dietary fibres ఉండడం వల్ల లావు తగ్గాలి అనుకునే వారు ఈ సబ్జా గింజలు తీసుకోవచ్చు.
వీటిలో నిలో ఫైబర్ ఉండడం వల్ల సబ్జా గింజలను తీసుకుంటే పొట్ట ఫుల్ అయ్యి ఆకలి తగ్గుతుంది.
అలాగే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడానికి మలబద్ధకాన్ని పోగొట్టడానికి,గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు,ఎసిడిటీతో బాధపడే వారికి సబ్జా గింజలు చాలా ఉపయోగపడుతుంది.
దీనిలో విటమిన్ K ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా ఈ సబ్జ గింజలు సహాయపడతాయి.
సబ్జా గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సబ్జా గింజలు ఎప్పుడు నానబెట్టి తీసుకోవాలి డ్రైగా ఉన్నవి తీసుకోకూడదు ఇలా తీసుకుంటే గొంతులో ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి.
రోజుకి ఒకటి, రెండు స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు తీసుకోవచ్చు.
Basil seeds telugu for weight loss & Basil seeds benefits
సబ్జా గింజలను గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నాన పెట్టడం వల్ల సబ్జా గింజలు ఉబ్బుతాయి. ఆ తర్వాత సబ్జా గింజలను తీసుకోవచ్చు.
ఈ సబ్జా గింజలను సాలిడ్, సూప్స్ ,లెమన్ టీ , లెమన్ జ్యూస్ లో కూడా ఉపయోగిస్తారు.
సబ్జా గింజలను ఎలాంటి సమయంలోనైనా తీసుకోవచ్చు కానీ బరువు తగ్గాలి అనుకునే వారు ఉదయమే తాగడం మంచిది ఈ సబ్జా గింజల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Basil seeds side effects
ఒకటి, రెండు స్పూన్లు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలుంటాయి. అంటే లూజ్ మోషన్స్, వాంతులు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
సబ్జా గింజలను గర్భిణీలు తీసుకోకూడదు దీనిని తీసుకుంటే Estrogen తగ్గుతుంది. దీనివల్ల మిస్ గ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయి. గర్భిణీలు మాత్రం తక్కువగా తీసుకోవడం లేదా తీసుకోకపోవడం చాలా మంచిది.
అలాగే చిన్న పిల్లలు కూడా తీసుకోకూడదు దీని వల్ల గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది.
విటమిన్ k దీనిలో ఉండడం వల్ల రక్తం పలుచగా ఉన్నవారు అంటే Aspirin, warfarin వంటి మెడిసిన్ వాడే వారు ఈ సబ్జా గింజలు తీసుకోకూడదు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in