Dark Circles:కంటి కింద నలుపు పోవడానికి చిట్కా చాలామందికి కంటి కింద నలుపు వచ్చి వాళ్ళ అందానికి ఆటంకం కలిగిస్తాయి. వాళ్లు ఎప్పుడైనా అందంగా రెడీ అయ్యి బట్టలు, ఆభరణాలు వేసుకొని బయటకి నలుగురిలోకి వెళ్ళాలి అన్నప్పుడు ఈ కంటి కింద నలుపు వాళ్లని వేధిస్తూ ఉంటాయి.
దీనిని తొలగించడానికి పోవడానికి రకరకాల లేజర్ ట్రీట్మెంట్ ను చేయించుకుంటూ ఉంటారు. కెమికల్స్ లాంటివి రకరకాలను వాడుతూ ఉంటారు.దీనివలన దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అసలు ఈ కళ్ళ కింద నలుపు రావడానికి కారణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది ఈ 11 రకాల కారణాల్లో మీకు ఈ కళ్ళ కింద నలుపు ఏ కారణం వల్ల వచ్చిందో వాటిని ఎలా తొలగించుకుంటే దీని వలన మీకు ఉపశమనం కలిగి పర్మినెంట్ సొల్యూషన్ లభిస్తాయో అనేది తెలుసుకుందాం ముందుగా ఆ 11 కారణాలు గురించి తెలుసుకుందాం.
1.స్ట్రెస్ వల్ల కళ్ళ కింద నలుపులు ఎక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లల నుంచి ,ఉద్యోగాలు చేసే పెద్దల వరకు అందరూ ఈ స్ట్రెస్ కి గురి అవుతున్నారు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే స్కిన్ సెల్స్ ఎక్కువ తయారైపోతుంది.
2. ఇంకా రెండవ కారణం కి వస్తే నిద్ర సరిగా లేకపోవడం,మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల, లేట్ నైట్ ఫుడ్స్ తినడం వల్ల.
ఇక 3.పనిలో అలసట ఎక్కువ గురవటం ఈ టైడ్నెస్ అనేది కళ్ళ కింద నలుపు రావడానికి, కళ్ళ కింద గుంటలు ఏర్పడడానికి కారణం అవుతుంది.
4. వారసత్వంగా తల్లి కుంటే పిల్లలకు, తండ్రి కుంటే పిల్లలకు తాతలకు, ముత్తాతలకు ఉంటే కూడా ఈ కంటి కింద నలుపు, కంటి కింద గుంటలు ఏర్పడటం అనేది రావచ్చు.
5.హార్మోన్ ఇబ్బంది వల్ల, హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ సమస్యల వల్ల ఈ కళ్ళ కింద నలుపు అవకాశం ఉంటుంది. కొంతమందికి బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఎక్కువ గా వస్తూ ఉంటుంది.
6. ఏజ్ పెరగడం వల్ల కొంతమందికి యవ్వనంలోని నలుపు ఉండదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ కంటి కింద నలుపు ఏర్పడుతుంది. అలవాట్లు మారడం వల్ల కూడా నలుపు వచ్చే అవకాశం ఉంటుంది.
7.కొంత మందికి హైపో థైరాయిడ్ వస్తుంది. హైపోథైరాయిడ్ వల్ల కంటి కింద నలుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
8. ఎనీమియా రక్తహీనత పాలిపోయినట్టు తెల్లగా ఉంటారు వాళ్లకి కూడా వస్తుంది.
9. స్మోకింగ్ మరియు ఆల్కహాల్ తాగడం వల్ల ఈ రెండు కారణాలు వలన ,కొన్ని రకాల మార్పులు వచ్చి కంటి కింద నలుపు వచ్చే అవకాశం ఉంటుంది.
9. డీహైడ్రేషన్ చాలామంది నీరు తక్కువగా తాగుతూ ఉంటారు. అలాంటి వారికి కంటి కింద నలుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
11. ఐ స్ట్రైన్ అంటే కంప్యూటర్స్ కానీ, ల్యాబ్ టాప్ కానీ, ట్యాబ్ లు గాని, టీవీ గానీ ఎక్కువగా చూడడం వల్ల, ఎక్కువ కంటికి స్క్రీన్ లైట్లు, చిన్న అక్షరాలు ,కలర్స్ లైట్లు ఎక్కువ అవ్వడం వల్ల, కళ్ళకి స్టేన్ ఎక్కువ అవ్వడం వల్ల కంటి కింద నలుపులు రావడం గానీ, కళ్ళ కింద గుంటలు ఏర్పడడం గానీ, కళ్ళు ఎరుపు గాని వస్తూ ఉంటాయి.
ఈ 11 కారణాలులో మీరు ఏ కారణం వల్ల కంటి కింద నలుపు వచ్చిందో తెలుసుకుని పర్మినెంట్ సొల్యూషన్ కావాలి అంటే వీటిని రెటిఫై చేసుకొని ప్రయత్నం చేస్తే చాలా మంచిది.
ఇంకా మన వంతుగా ఏ మార్పు చేసుకుంటే కంటి కింద నలుపు రాదో తెలుసుకుందాం. కంటి కింద నలుపు పోవడానికి కరక్కాయని తీసుకొని, సాన పెట్టే రాయి మీద కరక్కాయను అరగదీసి, ఆ లేపనాన్ని కళ్ళ కింద రాస్తే కళ్ల ఉండే మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అతిగా స్పందించి ఎక్కువ నలుపు వర్ణాలు ఉత్పత్తి చేస్తుంది.
అందుకే కంటికి నలుపు వచ్చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఆ సెల్స్ లో తగ్గించి నలుపు వర్ణాన్ని తగు మోతాదులో ఉండే లాగా కంట్రోల్ చేసే శక్తి కరక్కాయలో ఉంటుంది.
అందుకే రోజుకి రెండు సార్లు కరక్కాయ లేపనాన్ని కంటికింద రాయడం వల్ల కంటికి కింద నలుపు తగ్గుతుంది. యోగ ప్రాణాయామం లాంటిది చేస్తూ ఉండాలి.
స్ట్రెయిన్ లేకుండా బాడీకి రిలాక్స్ కలిగించే ఫుడ్ ని తీసుకుంటూ, వాటర్ ని ఎక్కువగా తాగుతూ పళ్ళ రసాలు లాంటివి ఆకుకూరలు నాచురల్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి కింద నలుపు రాకుండా రక్షించడానికి మంచి ఫుడ్ హెల్ప్ చేస్తుంది.
అలాగే రోజుకు నాలుగు లీటర్లు మించకుండా వాటర్ తాగడం వల్ల కూడా కంటి కింద నలుపు రాకుండా ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in