Read Time:3 Minute, 30 Second
Health Tips:ఆరోగ్య చిట్కాలు
- స్పూన్ గసగసాలను నానబెట్టి మెత్తటి పేస్ట్ గా చేసి వేడిపాలలో వేసి కొని తాగితే నిద్ర బాగా పడుతుంది.
- పిల్లలకు జలుబు వెంటనే తగ్గాలి.అంటే తమలపాకును బాగా నరిపి దాని నుండి వచ్చే రసంలో, ఒక చుక్క తేనెను కలిపి పిల్లలతో నాకిస్తే జలుబు వెంటనే తగ్గుతుంది.అలాగే తుమ్ములు బాగా వస్తూ ఉంటే కొత్తిమీరనే నలిపి ఆ రసాన్ని వాసన చూస్తే తుమ్ములు వెంటనే తగ్గుతాయి.
- వాతపరమైన నొప్పులతో బాధపడే వారు దాసిన చెక్క ను ఎండబెట్టి పొడి చేసుకుని రోజు వేడి పాలలో ఒక స్పూన్ ఈ పొడి వేసుకొని తాగితే వాతపరమైన నొప్పులు తగ్గుతాయి.
- ఎంతకీ తగ్గని పుండ్లు పై సీతాఫలం ఆకులను మెత్తగా నూరి దానిని పుండ్లపై పెట్టి కట్టు కడితే వారంలోగా పుండ్లు తగ్గుతాయి.
- ఇంగువ, హారతి కర్పూరం సమపాలంలో తీసుకొని పొడిగా చేసి కంది గింజంత ఉండలు చేసుకొని రోజు తింటూ ఉంటే ఉబ్బసం, ఆయాసం, గుండె దడ తగ్గుతుంది.
- నోటి పూత ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే కరక్కాయలు నూరి దానిని నాలికపై రాసి తరువాత కరక్కాయ బెరడును చూర్ణం చేసి ఆఫ్ స్పూన్ చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని తాగితే నోటి పూత తగ్గుతుంది.
- వేరుశెనగ నూనెని శరీరానికి రాసి మసాజ్ చేస్తే ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
- సెగ గడ్డలు వస్తే బియ్యం పిండిని నీటితో కలిపి ఉడకబెట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే సెగ గడ్డపై పెట్టి కట్టు కడితే సెగ గడ్డ త్వరగా చిదిగిపోతుంది.
- కొబ్బరి నూనెలో, హారతి కర్పూరం పొడి చేసి కలిపి రాస్తే దద్దుర్లు, దురద తగ్గుతాయి.
- రోజు పరగడుపున వేడి నీటిలో,సగం నిమ్మ రసాన్ని కలిపి కాస్త చిటికెడు ఉప్పును వేసి తాగితే బరువు తగ్గుతారు.
- గంధపు చెక్కను అరగదీసి ఆ పేస్టును వాపుల మీద రాస్తే వాపు త్వరగా తగ్గుతుంది.
- కరక్కాయ ముక్క ను బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే పొడి దగ్గు త్వరగా తగ్గుతుంది.
- ఆముదం తీసుకొని అరికాలకు రాస్తే అరికాలు మంటలు తగ్గుతాయి.
- గాయం తగిలి రక్తం కారుతూ ఉంటే పసుపు కానీ కాఫీ పొడి కానీ వేస్తే రక్తస్రావం ఆగుతుంది.
- గాయం తగిలిన చోట వెల్లుల్లి రసాన్ని రాస్తే బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in