Fruits Benefits:పండ్ల వల్ల లాభాలు కర్బుజా, పుచ్చకాయ, నిమ్మకాయ, పచ్చి మామిడి, దబ్బకాయ, పుదీనా, మజ్జిగ రసం అనాస పండు, సపోటా వంటివి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
ఇలాంటి రసాలు త్రాగడం వల్ల ఎండ వేడి వల్ల మూత్రంలో వచ్చే మంటను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.
మలబద్ధక సమస్య ఉండదు. ఈ జ్యూస్ లో విటమిన్ A,C లు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్ తో పొటాషియం బిసిక్స్ B1,B2 విటమిన్స్ ఉంటాయి. అజీర్తి కూడా తగ్గుతుంది. చర్మానికి నూతన యవ్వనం వస్తుంది.
ప్రేగులకు కూడా మేలు చేస్తుంది. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అనాసపండ్ల లో బ్రోమిలిస్ అనే ఎంజేమ్ ఉండడం వల్ల వాపులను తగ్గిస్తుంది. సంత్రా పండు తినడం వల్ల న్యూమోనియా వ్యాధి తగ్గుతుంది.
నారింజ: నారింజలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నారింజలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుచేత డయాబెటిక్స్ రోజుకి ఒక నారింజపండు తప్పనిసరిగా తీసుకోవాలి.
జామ పండు: తలనొప్పి మైగ్రేన్ లను నివారించును. డయాబెటిస్ లక్షణాలను తగ్గించును. మలబద్ధకం నివారణ. జలుబు నుండి ఉపశమనం శరీరానికి విటమిన్ సి, కాల్షియం లభించడం వల్ల శరీరానికి తక్షణ బలం, గ్యాస్టిక్ సమస్యలకు దరిచేనువ్వదు, దంత సంరక్షణ కూడా మెరుగుపరుస్తుంది.
పైనాపిల్: పైనాపిల్ లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
పైనాపిల్ తరచుగా తినడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. చర్మ నిగారింపును పెంచుతుంది. పళ్ళ నుండి రక్తం కారే స్కర్వి వ్యాధి నుండి రక్షిస్తుంది.
బొప్పాయి: డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన పండు ఇది. అధిక స్థాయి లో రక్తంలో చక్కెర ఉండేవాళ్లు కచ్చితంగా ఈ పండు తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in