Mouth CancerMouth Cancer
0 0
Read Time:16 Minute, 44 Second

Mouth Cancer:నోటి క్యాన్సర్ అందరూ తప్పక తెలుసుకోవలసిన విషయం నోరు మంచిదైతే ఆరోగ్యము మంచిదవుతుంది.

శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేర్చేది దీనిచే తిన్న ఆహారం, లాలాజలంతో కలిసి జీర్ణ క్రియ ఆరంభమయ్యేది ఇక్కడే ఇంత కీలకమైనది కాబట్టే నోటికి ఏ సమస్య వచ్చినా ఇబ్బందే చిన్న పొక్కు పుడితేనే విలువల్లాడిపోతాం.

అలాంటిది క్యాన్సర్ పుండు పడితే శరీరం మొత్తం అతలాకుతలమవుతుంది. మంచి విషయం ఏమిటంటే దీన్ని చాలా వరకు నివారించుకునే వీలుండటం. తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం కావటం, అయినా మన దగ్గర రోజు రోజుకి నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళకరం.

ప్రపంచవ్యాప్తంగా యాట సుమారు నాలుగు లక్షల మంది కొత్తగా దీన్ని బాధపడుతుండగా వీరిలో పావు వంతు నుంచి మన దేశానికి చెందిన వారే, వీరిలోని 60 % నుండి 70% మందిలో బాగా ముదిరిన తరువాతే జబ్బు బయటపడుతుండటం బాధాకరం.

నోటి క్యాన్సర్ మీద అవగాహన లేకపోవడం భయం వంటివి అన్నీ, అందుకు దోహదం చేస్తున్నాయి. ఈ నైవేద్యంలో ప్రపంచ నోటి క్యాన్సర్ అవగాహన సందర్భంగా నోటి క్యాన్సర్ ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం.


నోటి క్యాన్సర్ పెద్ద సమస్య ఇది పెదవుల దగ్గర నుంచి నాలుక, నాలుక క్రింది భాగం చిగుర్లు దంతాలు లోపలి బుగ్గలు, అంగిలి నాలిక వెనుకాల గొంతు వరకు ఎక్కడైనా రావచ్చు. మిగతా దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో నోటి క్యాన్సర్ చాలా ఎక్కువ.

ప్రపంచవ్యాప్తంగా వీటితో బాధపడుతున్న వారిలో సగం మంది ఇక్కడి వారే కావటం బాధాకరం .దీనికి చాలా వరకు కొన్ని ప్రత్యేకమైన దురాలవాట్లు కారణం. మన దేశంలో కనిపించే క్యాన్సర్ లో 25 శాతం నుండి 35% వరకు నోటి క్యాన్సర్లు అవి ఆడవారిలో కన్నా మగవారిలో ఇంకాస్త ఎక్కువ.

సాధారణంగా నోటి క్యాన్సర్ పుండ్లగానే మొదలవుతుంది. అయితే మన దగ్గర నోట్లో పుండ్లను పెద్దగా పట్టించుకోరు అవే తగ్గిపోతుంది అనే నిర్లక్ష్యం చేస్తుంటారు.

దీంతో చాలామందిలో ముదిరిన తరువాత బయటపడుతుంది. నిజానికి తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స తేలిక ఫలితము బాగుంటుంది. దాదాపు 20 నుండి 30% మందికి పూర్తిగా నయమవుతుంది. అదే ముదిరిన దశలోని సంక్లిష్ట చికిత్స అవసరమవుతుంది.

ఫలితము అంతంతే ఈ దశలో కేసులు 30 నుండి 35% మందిలోనే నయమవుతుంది.అంటే బోలెడంత ఖర్చు పెట్టి చికిత్సలు చేయించిన చాలామందిని కాపాడుకోలేకపోతున్నారు అని అర్థం. కాబట్టి నోటి క్యాన్సర్ ముందే గుర్తించడం కీలకం.

దీన్ని ముఖ్య కారణాలు, చికిత్స పద్ధతులు, వివరణ మార్గాల గురించి తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం.

ముప్పు కారణాలు ఇవే
పొగాకు వాడటం: అతి ముఖ్యమైన కారణం ఇదే మన దగ్గర సిగరెట్లు, చుట్టలు, బీడీలు వంటివి కాల్చడమే కాకుండా పొగాకు, పొగాకు కట్టలు జర్దా కిల్లిలు, గుట్కాలకు నములుతుంటారు.

ఇలాంటి అలవాటు భారత ఉపఖండంలోనే చూస్తుంటాం. పొగాకులో 100 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. జర్దా గుట్కాలు వంటి వాటిలో కలిపే రసాయనాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. గత 20 ఏళ్లలో నోటి క్యాన్సల్ పెరగటానికి ఇది ఒక కారణమే.

వక్కలు నమ్మటం
ఇది ప్రమాదమే ఒక్కల్లో ఉండే పలు రసాయనాలు క్యాన్సర్ ముప్పును తెచ్చి పెడతాయి. మరోవైపు వీటిని అదే పనిగా నమలటం వలన నోట్లో అతి సుష్మంగా పగుళ్లు ఏర్పడతాయి. ఇది నయమయ్యే క్రమంలో వాపు ప్రక్రియ ఇన్ఫర్మేషన్ మొదలవుతుంది. ఇది నిరంతరం ఇలాగే కొనసాగుతూ వస్తుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వక్కలతో సహా ప్రమాదం నోట్లోనే జిగురు పొరలు గట్టిపడటం దీంతో నోరు సరిగ్గా తీర్చుకోదు దీన్ని క్యాన్సర్కు ముందస్తు దశలాగా చెప్పుకోవచ్చు

మద్యం
ఇది మామూలుగానే నోట్లో చికాకును కలిగిస్తుంది. మరోవైపు శరీరంలోకి వెళ్లిన తరువాత మద్యం ఇది బలమైన క్యాన్సర్ కారకం మద్యానికి పొగ అలవాటు తోడైతే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

క్యాన్సర్ ముందు జబ్బులు
నోట్లో తెల్లటి, ఎర్రటి మచ్చలుగా కనిపించే లుకో ప్లేకియా, ఎర్రతో ప్లేకియా, లికానో ప్లానస్ అలాగే నోటి కణజాలం గడ్డకట్టడం వంటివి. కొందరిలో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది.

పంటి గాయాలు
కృత్రిమ దంతాలు, కట్టు స్థిరంగా లేకపోతే తరచూ బుగ్గల కు తాకచ్చు పళ్ళమధ్య చర్మం పడి పుండ్లు ఏర్పడవచ్చు. పళ్ళు మరీ పొడిగా ఉన్న వారిలోని తరచు పడుతుంటాయి. ఇవి మానకుండా పెద్దగా అయ్యి క్యాన్సర్ గా మారొచ్చు. ఎలాంటి దురాలవాట్లు లేని వారిలోని ముఖ్యంగా మహిళల్లో నోటి క్యాన్సర్ రావటానికి ఇదొక ముఖ్య కారణం.

నోటి శుభ్రత లోపించటం
నోరు పరిశుభ్రంగా లేకపోయినా ప్రమాదమే ఇది కారణంగా నోట్లో వాపు ప్రక్రియను ఇన్ఫర్మేషన్ దారి తీయొచ్చు. ఇలా క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేయొచ్చు.

హెచ్ పి పి
హ్యూమన్ పాపిల్లోని క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కే కాదు నోటి క్యాన్సర్కు కారకమై సుమారు 18 % నుండి20% నోటి సాంగ్ క్యాన్సర్ దీని మూలంగానే వస్తున్నా ఇటువంటి దురాలవాట్లు లేని 18 నుండి 25 ఏళ్ల యువతుల్లోని నోటి క్యాన్సల్ కనిపిస్తోంది. అనటానికి అదొక కారణం కావచ్చని భావిస్తున్నారు.

పర్యవరణ కాలుష్యం
మన శరీరంలో క్యాన్సర్ ను అడ్డుకునే క్యాన్సర్ ను ప్రోత్సహించే జన్యువులు రెండు ఉంటాయి. ఏవైనా భాగంలో ప్రోత్సహించే జన్యువులు ఉత్తేజితమైతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రక్రియ ఎక్కువ ఎందుకు జరుగుతుందనేది కచ్చితంగా తెలీదు కానీ రకరకాల కాలుష్య కారణాలు దీనికి దోహదం చేస్తున్న అనుమానిస్తున్నారు. కలుషితమైన గాలి, నీరు ద్వారా శరీరంలోకి వెళ్లి రసాయనాలు జన్యువులు పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ వినియోగం పెరగటం ముప్పును తెచ్చిపెడుతుంది.

వయసు
వయసు మీద పడుతున్న కొద్ది క్యాన్సర్ ను అడ్డుకునే కణాలు పనితీరు మందగిస్తుంటుంది. అందుకే వృద్ధాప్యంతోను క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

పోషణలేమి
రక్తహీనత విటమిన్ బి12 లోపం, విటమిన్ డి లోపం గల వారికి కొంతవరకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. జన్యువులు ఎప్పుడైనా దెబ్బతింటే అవి తిరిగి కుదురుకునే ప్రయత్నం చేస్తాయి. విటమిన్లు, ఖనిజాల లోపం గల వారిలో ఈ స్వభావం తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా పెదవులు స్వరపేటుగా వెనకాల భాగంలో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.

రోగ నిరోధక శక్తి క్షీణించటం
రోగనిరోధక వ్యవస్థ మందగించిన వారికి రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వేసుకునే వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు ఏమిటి
పుండ్లు
చాలా వరకు నోటి క్యాన్సర్ పుండుగానే మొదలవుతుంది. కానీ రూపంలో ఏర్పడటం చాలా అరుదు పెదవులు, నాలుక, అంగిలి, నాలుక కింద బుగ్గలో ఎక్కడైనా పుండు ఏర్పడవచ్చు. సాధారణంగా నోట్లో పుండ్లు రెండు మూడు వారాలు నయమవుతాయి. కనీసం మానే స్థితికైనా చేరుకుంటాయి. కానీ క్యాన్సర్ పుండు మానదు అందువల్ల మూడు వారాలు దాటినా పుండు మారకపోయినా మానుతున్న లక్షణాలు కనిపించక పోయిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

నొప్పి లేకపోవటం
పుండు అనగానే నొప్పి గుర్తుకొస్తుంది. అయితే క్యాన్సర్ ఏర్పడుతున్నప్పుడు దగ్గర్లోనే నాడులు క్షీణిస్తాయి కాబట్టి తొలి దశలు నొప్పి తెలియదు. కానీ క్యాన్సర్ ముదురుతున్న కొద్ది నొప్పి మొదలవుతుంది. మొదట్లో ఆహారాన్ని నమ్ముతున్నప్పుడు, మింగుతున్నప్పుడు, నొప్పి పుట్టొచ్చు తీవ్రమవుతున్న కొద్ది ఆహారం తినటం కష్టమవుతుంది .
లాలాజలం ఊరటం
పుండు మూలంగానో, నొప్పి మూలంగానో సరిగ్గా మింగలేక పోవటం వల్ల లాలాజలం ఊరొచ్చు.

నోరు సరిగ్గా తెరుచుకోకపోవడం
క్యాన్సర్ తీవ్రమైతే నోటి కండరాలు తినే స్థాయి దీంతో నోరు తెరవటం కష్టమవుతుంది. పెద్దగా నోరు తెరవలేక పోతున్నారంటే క్యాన్సర్ ముదురుతుంది అనే అర్థం.

మొద్దు బారటం
నోట్లో నాడులు దెబ్బతింటే నాలుక దవడ వంటి భాగాల్లో స్పర్స తగ్గచ్చు ఫలితంగా మొద్దు బారినట్టు అనిపించొచ్చు. రుచి తెలియకపోవచ్చు. నాలుకను ఒక వైపు నాడులు దెబ్బతింటే కదలికలు అస్తవ్యస్తంగా కావచ్చు.

చెవు నొప్పి దిబ్బడ
గొంతు వెనకాల పై భాగంలో క్యాన్సర్ తలెత్తితే చెవి దిబ్బడ నొప్పి కలుగుతుంది. సమస్య తీవ్రమైతే శ్వాసకు ఇబ్బంది కలగవచ్చు. నోట్లోని నాలుక వెనకాల మరీ పెద్దగా పుండు పడితే చెవులు నొప్పి రావచ్చు.

బరువు తగ్గటం
తీవ్రమైన దశలో తినటం కష్టం కావటం మెత్తటి పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల బరువు తగ్గొచ్చు.

దుర్వాసన
క్యాన్సర్ పుండు మరో లక్షణం ఎనోరోబిక్ ఇన్ఫెక్షన్ దీంతో రకరకాల రసాయనాలు పుట్టుకొస్తాయి. దీంతో ముదిరిన దశలో నోటి దుర్వాసన రావచ్చు. రక్తం సరఫరా కాకపోవడం వల్ల కొంత క్యాన్సర్ కణజాలం చచ్చు పడుతుంది. దీంతో నోటి నుండి చెడు వాసన రావచ్చు.

దంతం కదలటం
ఇదో ప్రత్యేక లక్షణం చిగుళ్ల భాగంలో క్యాన్సర్ ఉన్నట్లయితే పన్ను వదులై కదిలిపోవచ్చు అందువల్ల ఆదరణంగా అంటే తగ్గకపోయినా దంత దానంతట అదే వదులు కదులుతుంటే నిర్లక్ష్యం చెయ్యొద్దు.

నివారణ ఉత్తమం
మన దేశంలో వచ్చే నోటి క్యాన్సర్ లో 75 శాతం దురాలబాటులతో ముడిపడినవే వీటిలో ముఖ్యమైనవి. పొగాకు , మద్యం అలవాటు కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా చూసుకోవడం ముఖ్యం.

ఇందుకు ఎవరికీ వారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటు అవసరం పొగ త్రాగటం పొగాకు నమలటం చాలా వరకు 14 నుండి 20 ఏళ్ల వయసులోనే అలవాటు పడుతున్నారు.

ఉత్సాహతతో రుచి చూడటంతో మొదలే క్రమంగా అలవాటుగా మారుతుంది. పొగాకు లోని నికోటిన్ దీన్ని వదలనీయకుండా చేసి వ్యసనంగా మార్చేస్తుంది.

కాబట్టి బడిలోని పొగాకు అనర్ధాలు మీద బోధించడం మంచిది. పిల్లల మీద ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఎక్కువ చిన్నవయసులోనే అవగాహన కలిగితే పిల్లలను పొగాకు జోలికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.

అలాగే పాఠశాలకు చుట్టుపక్కల 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని నిబంధన కచ్చితంగా అమలు చేసేలా చూడాలి.

స్వచ్ఛంద సంస్థలు పొగాకు అనర్ధాల మీద మరింత ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. డాక్టర్లు కూడా రోగులు ఏ కారణంతో వచ్చిన ఒక్కసారి దురాలవాట్లు ఏవైనా ఉన్నాయా అని అడగాలి పొగాకు మద్యం అలవాటు ఉన్నట్టే నోట్లో బాక్స్ లైట్ వేసి పరీక్షించాలి.

దీంతో క్యాన్సర్ ముందస్తు సమస్యలు లక్షణాలు ఉంటే తేలికగా గుర్తించవచ్చు.
ముందస్తు పరీక్షలు
సమాజంలో దురాలవాట్లు గల వారికి తరచూ ముందస్తు పరీక్షలు చేయటం వల్ల నోటి క్యాన్సర్ తో సంభవించే మరణాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్టు కేరళలో నిర్వహించిన ఒక భారీ ఆధ్యాయంలో వెల్లడయింది.

అంతేకాదు చాలామందిలో తొలి దశలోనే జబ్బును గుర్తించడం సాధ్యమైంది కాబట్టి ముందస్తు నోటి పరీక్షలు చాలా ముఖ్యం.

పోషకాహారం
తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజ పప్పులు, నట్స్ ఎక్కువగా తినాలి. డబ్బాలు నిల్వ చేసే పదార్థాలకు ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది. కంటినిండా నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

దీంతో ఆరోగ్యం,సామర్ధ్యం అలవాటు చేసుకోవడం వల్ల ఇవి క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఒకవేళ కాన్సర్ వచ్చిన త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.

లుక్ ప్లేకియా, లేకో ప్లానస్ వంటి క్యాన్సర్ ముందస్తు సమస్యలు గలవారు. మూడు నాలుగు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నోటి పరీక్ష చేయించుకోవాలి.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *