Eluru:ఎన్నికలను ప్రశాంతంగా, సక్రమంగా విజయవంతం చేసినందుకు ఏలూరు జిల్లాలోని రిటర్నింగ్ అధికారులందరినీ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లాలో పోస్టుల్ బ్యాలట్ తో కలిపి
84.82% పోలింగ్ నమోదు చేసుకున్నాం, ఇది గత సాధారణ ఎన్నికలు-2019 కంటే ఎక్కువ.ఈరోల్ రివిజన్ మరియు స్వీప్ కార్యకలాపాలను చేపట్టిన ఈ అర్ వో లందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించారు.
ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న అధికారులందరికి అభినందనలు తెలిపారు , వారి కృషి లేకుండా ఈ ఎన్నికల పర్వం సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి గా వున్న తనకు సహాయ రిటర్నింగ్ అధికారిగా అన్నిటినీ చిరునవ్వుతో నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికారి డి. పుష్పమణి కృషిని అభినందిస్తున్నానన్నారు.
ఎన్నికల నిర్వహణలో సమార్డవంతంగా పనిచేసినందుకు కలెక్టరేట్ పరిపాలన అధికారి కె. కాశీ విశ్వేశ్వర రావు మరియు ఎన్నికల సెల్ డిప్యూటీ తహసీల్దార్లులు , సిబ్బందిని కూడా కలెక్టర్ అభినందించారు.మీడియా వారు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in