Read Time:2 Minute, 3 Second
face scrub:మెరిసే సహజ స్క్రబ్ లు ఇవే ఈ ఎండలకు ముఖం కళవిహీనంగా మారుతుంది. ఇలాంటి అప్పుడు చర్మం పునరావృత్తి పొందడానికి ఈ సహజ స్క్రబ్ లు మేలు చేస్తాయి.
- ఎండ ప్రభావానికి చర్మం నిర్జీవంగా మారిందా? కప్పు అరటిపండు గుజ్జుకి, చెంచా చెక్కెర కలిపి ముఖానికి రాసి రుద్దండి. ఇలా పది నిమిషాలు చేసి శుభ్రం చేస్తే చాలు. ఇందులో ఉండే విటమిన్ A,B ఈ పొటాషియం వంటి పోషకాలు చర్మంపై మృత కణాలను తొలగించి మృదువుగా మారుస్తుంది.
- రెండు చెంచాల కాఫీ పొడిలో, కాస్త తేనె కలిపి ఓ పది నిమిషాల పాటు ముఖానికి రుద్దండి. కాఫీ స్క్రబ్ ముఖంపై ఉన్న దుమ్ము దూళి మృత కణాలను సులువుగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేసి ప్రకాశవంతంగా మారుస్తుంది.
- రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, కాచిన పాలు, తేనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి రాయాలి. ముని వేళ్ళతో కనీసం 10 నిమిషాలైనా వృద్ధి చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
- కప్పు కలబందలో రెండు చెంచాల చక్కెర, నిమ్మను కలిపి ముఖానికి స్క్రబ్ చేయాలి. ఇది కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in