Diabetes:మధుమేహం కామన్ డిసీజ్ అయిపోయింది అందుకే చాలామంది పండ్లు తినరు షుగర్ లెస్ చాయ్ దొరుకుతుంది కానీ షుగర్ లెస్ ఫ్రూట్స్ దొరకవు కదా.
అందుకే ఏ పండులో ఎంత చక్కెర ఉందో తెలుసుకుంటే వాటి మోతాదును బట్టి తినొచ్చో లేదో ఒక అవగాహన ఏర్పరుచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ఆరెంజ్
ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది రుచిగా కూడా ఉంటాయి 100 మిల్లీలీటర్ల ఆరెంజ్ జ్యూస్ లో 8. 4 గ్రాముల చక్కెర ఉంటుంది
ఆపిల్
రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు ఆపిల్ గుజ్జులో ఉండే pecktin సాల్యూబుల్ ఫైబర్ ఆరోగ్యానికి మంచిది. 100 మిల్లి లీటర్ల ఆపిల్ జ్యూస్ లో 9. 6 గ్రాములు చక్కెర ఉంటుంది.
ద్రాక్ష
శరీరానికి అవసరమైన ఐరన్ కాపర్ మెగ్నీషియం ఖనిజాలు ద్రాక్షాలో ఉంటాయి. 100 మిల్లీలీటర్ల ద్రాక్ష జ్యూస్ లో 14. 2 గ్రాముల చక్కెర ఉంటుంది.
దానిమ్మ
ఇది చక్కని ఔషధ ఫలం 100 మిల్లి లీటర్ల దానిమ్మ జ్యూస్ లో 12. 65 గ్రాములు చక్కెర ఉంటుంది.
అరటి
ఐరన్ పుష్కలంగా లభించే పండ్లు అరటి పండ్లు అజీర్ణ సమస్యను కూడా ఇవి తగ్గిస్తాయి ఒక అరటిపండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది.
అవకాడో
మెదడు పనితీరును కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో అవకాడో ఔషధంగా పనిచేస్తుంది ఇందులో చక్కెర తక్కువగా ఉంటుంది ఒక అవకాడో లో కేవలం ఒక గ్రామ చక్రం మాత్రమే ఉంటుంది.
స్ట్రాబెర్రీ
ఈ పండ్లలో ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీ లో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.
చెర్రీ
నేరేడు జాతికి చెందిన చెర్రీ పండ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ కెమికల్ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.. ఒక కప్పు చెర్రీస్ లో 19 గ్రాములు చక్కెర ఉంటుంది.
జామ
ఈ పండ్లు తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ను అరికట్టవచ్చు. ఒక జామకాయ లో 5 గ్రాముల చక్కెర ఉంటుంది
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in