Masala Milk:ప్రోటీన్లు అందించే మిల్క్ మసాలా పొడి ఇంట్లోనే పిల్లలకు కాల్షియం అందాలి కనుక పాలు తప్పకుండా త్రాగాలి. అవి నోటికి రుచిగా ఉండి, బలాన్ని ఇవ్వాలని మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లు తెస్తుంటాం.
అలాంటి మిల్క్ మసాలా పౌడర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కొన్న దాని కంటే రుచి, శక్తి కూడా పైగా ఎలాంటి ప్రెజర్వేటర్స్లు ఉండవు. ఈ పౌడర్ చేసేందుకు పిస్తా, బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పులు, అర కప్పు చప్పున, పంచదార, గులాబీ కరణ, రెండు చెంచాల చొప్పున, సోపు చెంచా, మిరియాలు అర చెంచా, డ్రై జింజర, జాజికాయ పొడి, పసుపు పావు చెంచా చొప్పున, యాలక్కాయలు 15, కుంకుమపువ్వు కొద్దిగా సిద్ధం చేసుకోండి.
ఎలా చేయాలంటే
పిస్తా, బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పులను సన్న సెగ మీద నాలుగు నిమిషాలు వేయిస్తే మంచి వాసన వస్తుంది. వాటిని పళ్లెం లోకి తీసి సోపు మిరియాలు, యాలక్కాయలు, గులాబీ కరుణ, కుంకుమ పువ్వులను వేయించాలి.
ఇవన్నీ చల్లారాక జారిలోకి తీసి పంచదార, డ్రై జింజర పొడి, జాజికాయ పొడి, పసుపు చేర్చి మెత్తగా పొడి చేయాలి. జార్ మరి చిన్నదైతే రెండు విడతలుగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే మిల్క్ మసాలా పౌడర్ తయారయిపోతుంది.
మామూలుగా గ్లాస్ పాలుకు రెండు స్పూన్ల పొడి సరిపోతుంది. పిల్లల అభిరుచిని బట్టి ఇంకాస్త తక్కువ లేదా ఎక్కువ వేయొచ్చు. పంచదార కూడా విడిగా కలపాల్సిన పని లేదంటే ఎంత హాయి కదా. డ్రై ఫ్రూట్స్ మాత్రం తాజావి తీసుకోండి. కొన్నాళ్లు నిలవ ఉండాలి కదా.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in