Tattoo:పచ్చ బొట్టుకు కొన్ని జాగ్రత్తలు తారల్ని చూసి, ఫ్యాషన్ లో భాగం అనుకొని పచ్చబొట్టుపై మనసు పారేసుకుంటున్న అమ్మాయిలందరూ మీరు వేయించుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.
శుభ్రత: టాటూలో ink ని శరీరంలోకి చొపిస్తారు. కాబట్టి ఆ ప్రదేశం శుభ్రంగా లేకపోతే ఎలర్జీలకు దారి తీయొచ్చు. వెళ్లే ముందే శుభ్రం చేసుకుని ఆపై moisturizer రాయడం మర్చిపోవద్దు. ఆ ప్రదేశంలో వెంట్రుకలు ఉంటే వాటిని తొలగించుకోవాలి.
వదులు వస్త్రాలు: పచ్చబొట్టు పొడిపించుకోవడం నొప్పని తెలుసుగా వేయించుకునే ప్రదేశాన్ని బట్టి నొప్పి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇంకా నొప్పి పుడుతూ ఉంటే తెలియకుండానే శరీరాన్ని బెగబడతాం. ఆ సమయంలో బిగితైన వస్తువులు మరింత నొప్పికి కారణం అవుతాయి. కాబట్టి వదిలిన దుస్తులు వేసుకోవడం మంచిది.
సలహా తీసుకున్నకే: అందంగా ఉంటుందని ఎక్కడ వేయించుకోవాలో ఎంచుకున్నారు. అది సరైనదేనా అని నిపుణులు సలహా కోరండి. కొన్ని ప్రదేశాలు సున్నితంగా ఉంటాయి. నొప్పి వాపు వంటివి త్వరగా నయం అవ్వవు. ఆక్సిసారీస్ పెట్టుకుంటే సరిపోయే వేళ్ళు, మెడ వంటి వాటిని ఎంచుకోకపోవడమే మంచిది. ఇంకా రాపిడి ఉండే ప్రదేశాలైతే పదే పదే టచ్ అప్ చేయించుకోవలసి రావచ్చు. నొప్పి, ఖర్చు అదనం.
తిన్నాకే: పొట్ట నిండుగా ఉండేలా చూసుకోండి. ఆ చిన్నదేలే పర్లేదు అనుకోవద్దు ఎందుకంటే ఈ ప్రక్రియలో రక్తంలో చక్కెర శాతాలు పడిపోయే ప్రమాదం ఎక్కువ. అసలే డైట్ అనే బరువు పెరగద్దని తక్కువ తింటుంటాం. కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఎక్కువ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిని వెళ్లడం తప్పనిసరి.
ఆ తరువాత పచ్చబొట్టు వేయించుకున్నాక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో ముందుగా తెలుసుకోండి. లేదంటే నొప్పి తగ్గకపోవడం inkపోవడం వంటివి జరుగుతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in