Hiccups:పసి పిల్లలకు ఎక్కిళ్ళు వస్తే చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఇలా చేసి చూడండి. పిల్లలు ఎక్కువగా నవ్వితే ఎక్కుళ్ళు వస్తాయి.
అలాంటప్పుడు కంగారు పడకుండా వాళ్ల నోట్లో తేనె పీక పెట్టండి. దీనివల్ల డయోఫ్రం రిలాక్స్ అయ్యి ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
ఒక్కోసారి పిల్లలు పాలు తాగే బాటిల్ లను అదే పనిగా నోట్లో ఉంచుకున్నప్పుడు అందులో ఉండే గాలి ఎక్కువగా నోట్లోకి వెళుతుంటుంది.
దీంతో ఎక్కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందుకే నాణ్యమైన బాటిల్ లను వాడాలి. తల్లి పాలను ఇస్తే మరీ మంచిది.
చాలామంది తల్లులు పిల్లలకి ఏదైనా కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే గ్రేప్ వాటర్ పడతారు. అదే చిట్కా దీనికి కూడా పనిచేస్తుంది.
ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటే గ్రేప్ వాటర్ పట్టండి తగ్గిపోతాయి. ఒకవేళ ఈ చిట్కాలు అన్నీ పాటించిన సరే ఎక్కిళ్లు తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించండి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in