Nail Fungus:గోళ్లు పుచ్చితే కాళ్ళ గోర్లు పలచబడి తేలికగా విరిగిపోతుంటే నేల్ ఫంగస్ గా భావించాలి. నిర్లక్ష్యం చేస్తే ఫంగస్ గోరు మొత్తం వ్యాపించి పూర్తి గోరును కోల్పోవాల్సి వస్తుంది.
కాబట్టి ఈ చిట్కాతో గోళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ మూడు శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న సొల్యూషన్ ఎంచుకోవాలి. సమ పాలంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నీళ్లు ఒక ప్లాస్టిక్ టబులో కలుపుకొని ఈ నీళ్లలో పాదాలను 30 నిమిషాల పాటు ముంచి ఉంచాలి.
తరువాత తడి లేకుండా తుడవాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పక చేయాలి. ఫంగస్ వదిలి గోళ్లు సాధారణ రంగులోకి వచ్చిన ఈ చిట్కాను మానేయకుండా మరికొన్ని రోజుల వరకు కొనసాగించాలి.
ఫంగస్ అంత తేలిగ్గా వదలదు.
కాబట్టి కొంత ఓపికతో ఈ చిట్కాను కొనసాగించాలి. హైడ్రోజన్ పరాక్సైడ్ ను నీళ్లలో కలపడం వల్ల నీటిలోని ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. ఇలా పెరిగిన ఆక్సిజన్ తో గోళ్ళు లోని ఫంగస్ చనిపోతుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ,వెనిగర్ ను సమపాలంలో కలుపుకొని ఒక అరగంట పాటు పాదాలను ముంచి, తరువాత పొడి క్లాత్ తో తుడిచేయాలి. పైన చెప్పిన విధంగానే ఫంగస్ తగ్గిన మరికొద్ది రోజులు కొనసాగించాలి.
వెనిగర్ మరియు నీళ్లను సమపాలంలో తీసుకొని కూడా పాదాలు నానబెట్టవచ్చు.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా , హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు గోరువెచ్చని నీళ్లు కలిపి ఈ నీళ్లలో పాదాలను 30 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత తడి లేకుండా క్లాత్ తో తుడిచేయాలి. ఫంగస్ పూర్తిగా తగ్గే వరకు ప్రతిరోజు ఈ చిట్కా ను కొనసాగించాలి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in