Moong dal for skin:పెసర్లతో ఫేస్ ప్యాక్ పెసర్లు చక్కని పోషకాహారమే కాదు. సౌందర్య పరిరక్షణలోని ఉపయోగపడుతున్నాయి.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ మైక్రోబియన్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి.
నాలుగు చెంచాల పెసర్లను నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి అర చెంచా చొప్పున నారింజ తొక్క ల పొడి, చందనం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు ఆరనివ్వాలి. వారానికి మూడు రోజులు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
పొడి చర్మంతో ఇబ్బందా?
నాలుగు చెంచాల పొట్టు పెసరపప్పును నానబెట్టి రుబ్బుకోవాలి. దీనికి పాలను కలిపి ముఖానికి రాయాలి. పావుగంట ఆరేక చల్లటి నీటితో శుభ్రం చేస్తే చర్మానికి తగినంత తేమ అంది మృదువుగా మారుతుంది.
మొటిమలతో బాధపడుతుంటే నానబెట్టిన పెసరపప్పును రుబ్బుకోవాలి. దీనికి చెంచా గులాబీ నీరు, ముంతాన్ని మట్టి, కలిపి పూత లాగా ముఖం పై రాయాలి. తరువాత నీళ్ల తో చేతులు తడిపి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చర్మం లోతులో పేరుకున్న మురికి, నూనె తొలిగి మొటిమలు మచ్చలు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి వృద్ధాప్య ఛాయను దూరం చేసి చర్మాన్ని కోమలంగా కనిపించేలా చేస్తుంది.
ఎండకి చర్మం నల్లగా మారితే రెండు చెంచాల పొట్టు పెసర పిండిని, కాస్త పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టాన్ ఉన్నచోట రాసి పావుగంట ఆరా నివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగితే సరి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
పెసర పిండిలో, కాస్త తేనె, కలబంద గుజ్జు కలిపి చర్మానికి రాయాలి. ఆపై పాలతో తడిపి నలుగుల రుద్దితే చాలు. చర్మం పై పేరుకున్న మురికి వదిలి చర్మం తెల్లగా కనిపిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in