Gold polish at home:ఇంట్లోనే మెరుగు పడదామా పండుగ వచ్చిందంటే బీరువాలో ఉన్న బంగారం నగలు బయటకు వస్తాయి. అమ్మవారికి అలంకరణ గాను వాడుతుంటాం.
వేడుకలు అప్పుడు వేసుకొని తిరిగి హడావిడిగా భద్రపరుస్తుంటాం. దీంతో కొన్నిసార్లు నల్లగా మారుతాయి. మెరిపించాలా ఈ చిట్కాలను ప్రయత్నించండి.
ఒక గిన్నె నిండుగా వేడి నీటిని తీసుకుని కొన్ని చుక్కల డిష్ వాష్ లిక్విడ్ లేదా చెంచా షాంపూ వెయ్యాలి. ఆ మిశ్రమంలో నగలు వేసి కొద్దిసేపు నానబెట్టాలి.తరువాత వాటిని మెత్తని బ్రష్ తో చల్లటి నీటిలో కడిగి, పొడి
వస్త్రంతో తుడిస్తే సరి.
నీటిలో లిక్విడ్ డిటర్జెంట్, బేకింగ్ సోడా అర చెంచా చొప్పున వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నగలను వేసి అరగంట నానబెట్టాలి. ఆపై నీటితో శుభ్రంగా కడిగేయాలి. తరువాత ఆ ఆభరణాలు కొత్త వాటిలాగా మెరుస్తాయి.
డిటర్జెంట్ పౌడర్, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో పిండాలి. దానిలో నల్లబడిన ఆభరణాలను వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. తరువాత వాడే టూత్ పేస్ట్ రాసిన బ్రష్ తో రుద్దిన ఫలితం కనిపిస్తుంది.
బంగారు గాజులు అయితే ముందు కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టాలి.
తరువాత రెండు చెంచాల సెనగపిండి, తగినంత వెనిగర్ కలిపి మెత్తని పేస్ట్ ఇలా చేయాలి. ఆ మిశ్రమాన్ని ఆ నగలకు పట్టించి కొంతసేపు పక్కన పెట్టాలి. తర్వాత టూత్ పేస్టు తో రుద్ది కలిగితే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in