Snoring Tips:గురకతో మూర్చ గురక చాలా వరకు చిన్న వయసులోనే మొదలవుతూ ఉంటుంది. కానీ ఇది జీవితంలో ఎప్పుడైనా కొందరికి 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా వస్తుంటుంది.
అందుకే దీన్ని ఆలస్యంగా మొదలయ్యే మూర్చ గా భావిస్తుంటారు. పక్షవాతం అధిక రక్తపోటు మెదడులో కణితి వంటికి రకరకాల అంశాలు దీనికి దోహదం చేస్తుంటాయి. అయితే గురకను తక్కువగా తీసుకోవడానికి వీల్లేదని తాజా అధ్యయనం పేర్కుంటుంది. 60 ఏళ్ల తరువాత తొలిసారి మూర్చ రావడానికి నిద్రపోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆడక పోవటం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గటానికి సంబంధం ఉంటుందట్టు తేలటమే దీనికి కారణం. నిద్రలో కొందరికి గొంతు వెనకాల భాగం వదిలే శ్వాస మార్గానికి అడ్డు కలుగుతుంది. దీంతో శ్వాస ఆగుతుంది. అప్పుడు రక్తంలో ఆక్సిజన్ తగ్గటం వల్ల ఉక్కిరిబిక్కిరిగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటుంటారు. నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ విషయం మనకు తెలీదు. కానీ రాత్రంతా చాలాసేపు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. వృద్ధాప్యంలో మూర్ఛకు కారణం అవుతున్నట్టు ఇప్పుడు బయటపడింది. నిద్రపోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగిపోయే వారికి రెండింతల ముప్పు పెరుగుతున్నట్టు వెళ్లడయ్యింది. అదే రక్తంలో ఆక్సిజన్ 30% కన్నా తక్కువకు పడిపోయిన వారి కైతే మూడింతలు ఎక్కువగా ముప్పు ముంచి పొంచి ఉంటున్నట్టు తేలింది. దీర్ఘకాలంగా నిద్రలో ఆక్సిజన్ శాతం తగ్గుతూ వస్తుంటే మెదడులో మార్పులు తలెత్తే అవకాశం ఉందని ఇది మూర్చ ముప్పు పెరిగేలా చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. స్లిప్ ఆఫ్నియా చికిత్స లేదా నివారణతో మూర్చ వచ్చే అవకాశం తగ్గుతుందో లేదో అనేవి అధ్యయనంలో నిర్ధారణ కాలేదు. కానీ మూర్చ ముప్పును తగ్గించుకోవటానికి దీని ముఖ్యమైన అంశాల పరిగణించవచ్చని సూచిస్తుంది. నిద్ర సమస్యలు వృద్ధాప్యంలో వచ్చే మూర్చకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరంభమయ్యే మూర్ఛ సమస్య ఎక్కువవుతుంది. ఈ నైపద్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు కల్పిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in