Hair Dye Strains:హెయిర్ డై మచ్చలు పోవాలంటే సౌందర్య పోషణలో భాగంగా చాలామంది హెయిర్ డైలు వేసుకోవడం కామన్ అయితే కొన్ని సందర్భాల్లో అవి చర్మానికి అంటుకొని అక్కడ మచ్చలాగే ఏర్పడుతుంది. ఇంకా ఎంత రుద్దిన ఓ పట్టాన వదలవు అయితే ఇలాంటి మచ్చని తొలగించుకోవటానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.
వెనిగర్ లో ముంచిన కాటన్ బాల్ తో మచ్చ పడిన చోట రుద్దడం వల్ల అక్కడ మృత కణాలు తొలగిపోయి మార్చబడిన ప్రదేశం తిరిగి కాంతివంతం అవుతుంది.
నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మొక్క ను తీసుకొని దాంతో మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్దాలి. కాసేపు అలాగే ఉంచిన తరువాత గోరువెచ్చ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
దుస్తులపై పడిన మరకల్ని తొలగించడానికి మనం డిటర్జెంట్ ఉపయోగిస్తుంటాం. అయితే దీంతో చర్మంపై పడిన డై మచ్చని కూడా పోగొట్టొచ్చు. ఇందుకోసం కాస్త డిటర్జెంట్ను మరక పడిన చోట రాసి చేతివేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఆపై గోరువెచ్చని నీటిలో ముంచిన కాటన్ క్లాత్ తో ఆ ప్రదేశాన్ని సబ్బు పోయేదాకా శుభ్రం చేస్తే సరిపోతుంది.
బేబీ ఆయిల్ తో పాటు కొన్ని ఎసెన్షియల్ నూనెలు కూడా డైమచ్చను తొలగించడంలో సహాయపడతాయి. వీటిలో ఏదైనా కాస్త నూనెను తీసుకొని దాన్ని మచ్చపై అప్లై చేసి చేతి ముని వేళ్ళతో రుద్దాలి. కొంతసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
అయితే ప్రస్తుతం చర్మానికి అంటిన వెంటనే తొలగిపోయే హెయిర్ డై లు కూడా వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని వాడుకోవడం మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in