Makeup:ఎక్కువ గంటలు మేకప్ ఉండాలంటే పండుగలు, వేడుకలు అప్పుడు హడావిడి ఎక్కువ దీంతో శరీరానికి చెమట పట్టి మేకప్ కరిగిపోయే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా జిడ్డు తత్వం ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఎక్కువ గంటలు మేకప్ చెక్కు చెదరకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు నిపుణులు చెబుతున్నారు ఇలా.
రసాయనాలు లేని లిక్విడ్ ఫేస్ వాష్ తో ముఖాన్ని ముందుగా శుభ్రపరుచుకోవాలి
అప్పటికి శుభ్రంగా చేసుంటే కనుక రోజ్ వాటర్ ముఖానికి స్ప్రే చేసి దూది ఉండతో మృదువుగా తుడవాలి. చేసినప్పుడు ముఖంపై ఎక్కడైనా మురికి ఉంటే దూరమవుతుంది. మేకప్ కు ముందుగా ముఖ చర్మ పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి. ఆ తరువాత ఐస్ క్యూబ్ తో ముఖాన్ని మృదువుగా రూద్ధి ఆరనిస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది.
ప్రైమర్: జిడ్డు చర్మం ఉన్నవారికి ప్రైమరీగా కలబంద గుజ్జు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కువసేపు మేకప్ చెదరకుండా ఉంచగలుగుతుంది. ముఖానికి మృదువుగా కలబంద గుజ్జుని ప్రైమరీగా ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. లేదంటే బేబీ moisturizer రాసుకున్న మంచిదే రెండు చుక్కలు ముఖంపై రాసి మృదువుగా మర్దన చేసి రెండు నిమిషాల పాటు ఆరనిస్తే పూర్తిగా చర్మంలో ఇంకుతుంది.
ఫౌండేషన్ : జిడ్డు చర్మ తత్వానికి సరిపోయేలాగా అలాగే శరీర వర్ణానికి తగ్గట్లుగా ఫౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. లిక్విడ్ ఫౌండేషన్ రెండు, మూడు చుక్కల్ని తీసుకొని వేళ్ళతో ముఖమంతా రాసుకోవాలి. ఇది ఆరాక కాంపాక్ట్ పౌడర్‌ను లైట్ గా అద్దాలి. హైలైటర్దతో చెక్కిళ్ళు, ముక్కు చివరి గడ్డంపై తీర్చిదిద్దితే మెరిసిపోతారు.
కంటికి: కనురెప్పలను విశాలంగా కనిపించేలా చేయడానికి ముందుగా కాస్తంత ప్రైమరీను రాసుకోవాలి. ఆపై బ్రష్ తో ఐషాడో వేయాలి. అందుకున్న మీరు ఎంచుకున్న దుస్తులు బట్టి చర్మచాయికి నప్పేలా ఈ రంగుల్ని ఎంచుకోవాలి. పైన కనుబొమ్మలను పెన్సిల్ తో లైనింగ్ చేసి బ్రష్ చేయాలి. కంటికి కాటుక దుద్దిన తరువాత కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి మస్కరా వేస్తే చాలు. కళ్ళు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అధరాలను: పెదవులకు లిప్‌స్టిక్ రాయడానికి ముందుగా లిప్ బమ్ ను రాయాలి. రాత్రి సమయంలో ముదురు వర్ణాలను ఎంచుకుంటే మేలు. దుస్తులకు తగినట్లు ముఖానికి ఆకర్షణంగా కనిపించేలా పండుగ కళ కనిపించాలంటే ఆరేడు గంటలు నిద్ర, మంచి ఆహారం, తగినంత నీరు తాగితే చాలు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in