tamarind leavestamarind leaves
0 0
Read Time:4 Minute, 15 Second

Bad Cholesterol:చింతచిగురుతో చెడు కొలెస్ట్రాల్కు చెక్ చింత చచ్చిన పులుపు చావలేదన్న సామెతను ఆయా సందర్భాల పోలిక కోసం ఉపయోగిస్తుంటాం.

పులుపు సంగతి ఎలా ఉన్నా చింత చిగురు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. ఈ కాలంలో విరివిరిగా లభ్యం అయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం.

చింతచిగురు లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్య సిద్ధమైన లెక్సోటీవ్ గా పనిచేసి విరోచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలిగిపోతుంది. పైల్స్ ఉన్నవారికి కూడా చింత చిగురు బాగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చలి జ్వర లాంటివి పోగుడుతుంది.
చింతచిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట వాపు తగ్గుతాయి.
యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు చింతచిగురులో ఉన్నాయి.
వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పుండ్లు చింతచిగురు తగ్గిస్తుంది.
గుండె జబ్బు లను రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతూ చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.
జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగించడంలో చింతచిగురు బాగా ఉపయోగపడుతుంది.
చింతచిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి గా లభిస్తాయి.
ఎందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, ఆంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.
పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురు లో ఉన్నాయి.
తరచూ చింత చిగురు తింటే ఎముకలు దృఢత్వంగా సంతరించుకుంటాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు చింత చిగురు తమ శరీరంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు కూడా చింత చిగురు వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.
ఆల్కహాలిక్ ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
చింతచిగురును పేస్ట్ చేసి దాన్ని కీళ్ల పై ఉంచుతే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
ఆర్థోపెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.
శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే గుణాలు చింత చిగురు లో ఉన్నాయి.
ఇది యాస్ట్రోజన్లుగా పనిచేస్తుంది.
నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *