Bhimavaram:భీమవరం:జూన్ 02,2024. కౌంటింగు అధికార్లకు, సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ పక్రియను కౌంటింగు పరిశీలకులు యం.దీప, యల్.నిర్మల రాజ్, బి.డి.కుమావత్ సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ తెలిపారు
ఆదివారం జిల్లా కలెక్టరేటు వశిష్ఠ కాన్ఫరెన్స్ నందు సార్వత్రిక ఎన్నికల కౌంటింగు ప్రక్రియ నిర్వహణకు అవసరమైన అధికారులకు, సిబ్బందికి నియోజకవర్గాల వారీగా కౌంటింగు సెంటరు విధులను కేటాయిస్తూ రెండవ విడత ర్యాండమైజేషన్ ను ఎన్.ఐ.సి. అధికారులతో కలిసి పక్రియను జిల్లా కలెక్టరు పూర్తి చేశారు. నరసాపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎంలు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు, పర్యవేక్షించేందుకు గాను కౌంటింగు సూపర్ వైజర్లు, కౌంటింగు అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు రిజర్వుడు స్టాఫ్ తో కలిపి మొత్తం 959 మందికి సంబంధించి ఈరోజు ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగింది. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు 294 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 348 మంది, మైక్రో అబ్జర్వర్లు 317 మంది ఉన్నారు. యం.దీప తాడేపల్లి గూడెం, ఉండి, భీమవరం నియోజక వర్గాలకు, యల్.నిర్మల రాజ్ నరసాపురం,తణుకు నియోజక వర్గాలకు, బి.డి.కుమావత్ ఆచంట, పాలకొల్లు నియోజక వర్గాలకు కౌంటింగు పరిశీలకులుగా వ్యవహరించనున్నారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు, ఉండి నియోజక వర్గం ఆర్వో సి.వి.ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు, డ్వామా పిడి యం.ప్రభాకర రావు, డిఆర్డిఏ పిడి యం.యస్.యస్.వేణు గోపాల్, డిఎల్డివో ఏ.వి.అప్పారావు, ఎలక్టన్ సూపర్డెంటు చందన దుర్గా ప్రసాదు, డిప్యూటీ తహశీల్దారు మర్రాపు సన్యాసి రావు, ఐటి డిప్యూటీ డైరెక్టరు బొప్పన బాలయ్య, యన్ఐసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in