Leftover Rice Recipes:మిగిలిన అన్నంతో స్నాక్స్
అన్నంతో పకోడీలు
కావలసినవి: అన్నం- రెండు కప్పులు, పచ్చిమిర్చి- రెండు, కరివేపాకు- ఒక రెమ్మ, ఉప్పు- రుచికి తగినంత, జీలకర్ర- ఒక స్పూన్, అల్లం పేస్ట్- ఒక స్పూన్, శెనగపిండి -నాలుగు స్పూన్లు, బియ్యం పిండి- రెండు స్పూన్లు, కొత్తిమీర- ఒక కట్ట, నూనె- డీప్ ఫ్రైకి తగినంత తయారీ విధానం: ముందుగా మిక్సీలో అన్నం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఒక పాత్రను లోకి తీసుకొని అందులో శెనగపిండి, బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసి కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం పేస్టు, తరిగిన పచ్చిమిర్చి, వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవా.లి స్టవ్ పై పాత్రను పెట్టి నూనె పోసి వేడి అయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీల వేసుకోవాలి. సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్ గా ఈ పకోడీలు సర్వ్ చేసుకోవాలి.
అన్నంతో మురుకులు
కావలసినవి: అన్నం- మూడు కప్పులు, సగ్గుబియ్యం- ఒక కప్పు, నిమ్మరసం- మూడు టీ స్పూన్లు, పెరుగు- రెండు టీ స్పూన్లు, నూనె- సరిపడా, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- ఒక టీ స్పూన్
తయారీ విధానం: అన్నం, సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని అందులో పెరుగు, మిరియాల పొడి, నిమ్మరసం తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ పై పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మురుకులు గొట్టంలో పెట్టి ఒత్తుకోవాలి. కరకరలాడేనా వేయించుకుంటే ఈ మురుకులు రుచిగా ఉంటాయి.
అన్నంతో పునుగులు
కావలసినవి: అన్నం -రెండు కప్పులు, పచ్చిమిర్చి -రెండు ,సెనగపిండి -ఒక కప్పు, క్యారెట్ -తురుము ఒక కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర- రెండు స్పూన్లు, అల్లం పేస్టు- ఒక స్పూన్, జీలకర్ర- ఒక స్పూన్, కారం- ఒక స్పూన్, ఉప్పు- రుచికి తగినంత ,నూనె- సరిపడా
తయారీ విధానం: ముందుగా మిక్సీలో అన్నం వేసి మెత్తగా పెట్టుకోవాలి. తరువాత సెనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మరోసారి పెట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి .ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని పునుగులు వేసుకొని వేయించాలి. వేడి వేడి పునుగులు టమోటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
అన్నంతో ఇడ్లీ
కావలసినవి: అన్నం -రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ- ఒక కప్పు ,ఉప్పు- తగినంత,
తయారి విధానం: ఒక గంట ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. అందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి బాగా కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు నూనె రాసి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకోవాలి. చట్నీతో వేడి వేడి అన్నం ఇడ్లీలను తినాలి.
అన్నంతో కట్ లైట్
కావలసినవి: అన్నం -రెండు కప్పులు, ఓట్స్- ఒక కప్పు, క్యారెట్ తురుము- ఒక కప్పు, పుదీనా- ఒక కప్పు, ధనియాల పొడి- ఒక టీ స్పూన్, కారం -రెండు టీ స్పూన్లు, ఉప్పు- తగినంత,
తయారి విధానం: ఒక ప్లేట్ లో అన్నం తీసుకొని అందులో ఓట్స్, క్యారెట్ తురుము, ధనియాలపొడి, కారం, తగినంత ఉప్పు వేసుకుని వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి వేయించాలి. వేడి వేడిగా తింటే ఈ కట్ లైట్లు రుచిగా ఉంటాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in