Chocolate Samosa:చాక్లెట్ సమోసా
కావలసినవి: బయట పిండి కోసం మైదా- కిలో, నెయ్యి -35 గ్రాములు, యాలుక్కాయలు- ఐదు, ఫిల్లింగ్ కోసం: చాక్లెట్- 500 గ్రాములు, బాదం, జీడిపప్పు -250 గ్రాములు, చొప్పున పిస్తా- 100 గ్రాములు ,పంచదార -కేజీ,నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ :మైదాలో, నెయ్యి, యాలకుల పొడి వేసి నెయ్యి పిండికి పట్టేలా బాగా కలపాలి. నెమ్మదిగా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ పిండిని తడపాలి. ఆ తర్వాతే 20 నిమిషాలు నానబెట్టాలి. సమోసా లోపల పెట్టడానికి చాక్లెట్ ని డబల్ బాయిలర్ అంటే చాక్లెట్ ని గిన్నెలో ఉంచి దాన్ని మరుగుతున్న నీళ్లలో మరో గిన్నెలో ఉంచి చాక్లెట్ ని మరిగించుకోవాలి. దీనికి పంచదార జత చేయాలి. తీపి ఎక్కువగా ఉండే చాక్లెట్ వాడితే చక్కెర తక్కువగా వాడుకోవాలి. కరిగిన చాక్లెట్లో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు ,పిస్తా కలపాలి. తడిపిన పిండిని చిన్న ఉండల్లా చేసుకొని గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇలా చేసిన గుండ్రటి చపాతిని రెండుగా కోసుకోవాలి. ప్రతి సగం ముక్క ను కోన్ ఆకారంలో మడుచుకోవాలి. ఈ కోన్ లో చాక్లెట్ మిశ్రమాన్ని వేసి అంచులను నీళ్లతో అతికించుకోవాలి. యాలకులను పొడి చేయకుండా విత్తనాలను సమోసా పిండిలో కూడా కలపచ్చు. సమోసా కి కావలసిన రుచి వస్తుంది. వీటిని నూనెలో గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు మంటను మధ్యస్థంగా పెట్టి తరువాత పెద్ద మంట మీద వేయించుకుంటే సమోసా క్రిస్పీగా వస్తుంది. చివరగా టిష్యూ పేపర్ పై ఫ్రై చేసిన సమోసాలు చేసి సర్వ్ చేసుకుంటే సరి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in