Ayurveda Tips:ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం పొందండి
అతి బరువు: తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.
నేరిసిన వెంట్రుకలు నల్లబడుటకు కరక్కాయ, తానికాయ,ఉసిరికాయ ఈ మూడిటిని బెరడు నీలి ఆకు, లోహ చూర్ణము, వీటిని సమ భాగాలుగా, గుంటగలగ,ర నిజ రసము, జీలకర్ర రసము, గొర్రె మూత్రము కలిపి మెత్తగా దంచి రోజు ఉదయం లేక సాయంత్రం తలకు రాసుకొని దట్టముగా లేపనం చేసి రెండు మూడు గంటలు తరువాత కుంకుడు కాయతో తల స్నానం చేసిన తెల్ల వెంట్రుకలు క్రమంగా తగ్గిపోతాయి.
పులిపిర్లు తగ్గుటకు: ఉత్తరేనీఆకు, హరిచందనమును, నువ్వులు నూనెతో కలిపి మెత్తగా నూరి పులిపిర్లు పై లేపనం చేయవలెను.
శరీరం బిగువుకు: మేడిపాలు, మర్రి పాలు, నువ్వుల నూనెతో కలిపి కాచి శరీరానికి మర్దన చేసుకోవాలి.
వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు: మినుములు, మెంతులు, ఉసిరి సమంగా తీసుకొని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను. ఆరిన తరువాత కుంకుడు రసంతో స్నానం చేయవలెను. అలా చేసిన మూడు రోజుల్లోనే అద్భుత ఫలితం కలుగుతుంది.
అధిక మాంసం తగ్గుటకు: ఆవనూనితో మర్దన చేస్తే అధిక మాంసం తగ్గుతుంది. తలలోని పేలు: సుగంధ పాలను, గోమూత్రంలో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ ఉంటే తలలోని పేలు హరించి పోతాయి.
జుట్టు తిరుగుటకు: రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదం రాసి జుట్టును పక్కకు దివ్వాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకున్న వచ్చును. కుంకుడు రసం తోని తల స్నానం చెయ్యాలి షాంపు ను వాడకూడదు.
మొటిమలు: సుగంధి పాల వేళ్ళ బెరడు చూర్ణము, పెసరపిండి ,హారతి కర్పూరం, ఈ మూడు సమభాగాలముగా కలిపి ఈ చూర్ణముతో ముఖానికి నలుగు పెట్టుకుంటూ ఉంటే ముఖం మీద మొటిమలు మచ్చలు హరించిపోతాయి. సుగంధ పాల వేళ్ళ చూర్ణము, వస చూర్ణము, ధనియాలు చూర్ణం, ఈ మూడిటిని భాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు, మచ్చలు హరించి పోతాయి.
నల్ల మచ్చలు పోవుటకు: ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చును తీసివేసి, లోపలి పప్పులు 12 గ్రాములు, సొంటిపొడిని కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజలు అంత టాబ్లెట్స్ చేసి ఉంచుకొని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున రెండు పూటలా మంచినీళ్లతో వేసుకుంటూ ఉంటే రెండు, మూడు నెలలు నల్ల మచ్చలు అన్ని నామరూపాలు లేకుండా పోతాయి.
వళ్లు తగ్గుటకు: వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నేల మీద పడకుండా పట్టుకుని నిలువుంచి రోజు ఉదయం పూట 50 గ్రాముల వాన నీటిలో, చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతుంటే మూడు నెలల్లో స్థూల శరీరం తగ్గిపోతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in