Potato:ఆరోగ్యానికి ఆలుగడ్డలు మనము రోజు వండుకునే బంగాళదుంపలనే ఆలుగడ్డలు, ఊర్ల గడ్డలు, పొటాటో అని పిలుస్తారు.
ప్రపంచంలోనే అన్ని దేశాలలోని దుంపలను విరివిరిగా ఆహారంగా వాడుతున్నారు. శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం రాబోయే భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రధానమైన ఆహార పదార్ధం బంగాళదుంపలే.
అనాదిగా ఇది వాడకంలో ఉన్నప్పటికీ దీని విలువను ఒకవేళ 1, 771 వ సంవత్సరంలో గుర్తించడం జరిగింది.
కాస్త అటు ఇటుగా అదే సమయంలో ఈ దుంపలు మన దేశంలో వాడుకలోకి వచ్చాయి. వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి , ఆల్కలిన్ సాల్ట్ లు, ప్రోటీన్లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
100 గ్రాముల బంగాళదుంపలు కొవ్వు 0. 1, ఖనిజ లవణాలు 0. 6, పీచు పదార్థం 0. 4, మాంస కృతులు 1. 6, పిండి పదార్ధం 22. 6, గా ఉంటాయి.
అంతేకాకుండా కాల్షియం 10 మిల్లీగ్రాములు, ఐరన్ 0. 7 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ ఉన్న పాయింట్ ఏడు మిల్లీగ్రాములు కలిగి ఉంటాయి.
విటమిన్ సి 17 మిల్లీగ్రాములు కలిగి ఉంటుంది. తక్కువ మోతాదులో విటమిన్ ఏ, విటమిన్ బి కూడా బంగాళదుంపల పోషక పదార్థాలన్నీ పై పొట్టు పై దగ్గరగా ఉంటుంది. అందుచేత పొట్టు తీసి చేయునప్పుడు పైపైన మాత్రమే తీసివేస్తుండాలి.
లావుగా ఉన్నవారు బంగాళదుంప తింటుంటే ఇంకా లావు అవుతారు. అందుచేత స్థూల కాయలు బంగాళదుంపల జోలికి పోకుండా ఉండటమే మంచిది. కేవలం ఆలుగడ్డ లోనే కొన్ని మసాలా పాటు తింటూ ఉంటే ఆ మలబద్ధకం తగ్గిపోతుంది.
ఆలుగడ్డలు వాడటం వలన స్కర్వి వ్యాధిని నివారించవచ్చు. రోజు క్రమం తప్పకుండా రెండు మూడు చెంచాల బంగాళదుంపల రసాన్ని తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
అంతేకాకుండా ఆలుగడ్డపై తీసిన పొట్టును నీటిలో వేసి కాచి, నీటిని రోజు తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆలుగడ్డల వలన జీర్ణ రసం వ్యాధులు కూడా నయమవుతాయి.
పచ్చి ఆలుగడ్డల రసం రోజు చర్మానికి రాసుకుంటుంటే చర్మంపై వచ్చే మచ్చలు తగ్గిపోతాయి.
ఆలుగడ్డల గుజ్జును ముఖానికి రాసుకుంటే వయసు వచ్చే మచ్చలు మాయమవుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది.
పచ్చి బంగాళాదుంప రసాన్ని తీసి అందులో గ్లిజరిన్ కలిపి రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
బంగాళదుంప తీయగా ఉంటుంది బలకరం, కడుపు ఉబ్బరం, కలిగిస్తుంది. ఆలస్యంగా జీర్ణం చేయును.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in