Bhimavaram:భీమవరం: జూన్ 14,2024. ఒకరి రక్త దానంతో మరో ముగ్గురికి ప్రాణ ధానం చెయ్యవచ్చునని, రక్త దానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించవలసిన భాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆధిత్య అన్నారు.
శుక్రవారం స్పందన సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆధిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం అని, ప్రతి ఒక్కరిలో అవగాహన, సేవా భావం ఉండాలన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదని, సేకరించిన రక్తం ద్వారా ప్లాస్మా, ప్లేట్లెట్స్, రక్తం మూడు విభాలుగా విభజించి మరో ముగ్గురికీ ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. 18 సంవత్సరాలు నుండి 55 ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులని, స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చుటకు ముందుకు రావాలని కోరారు. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో సుమారుగా 20 లక్షల జనాభా ఉన్నారని, వారికి 24 వేలు యూనిట్లు రక్తం అవసరం అవుతుందని, అందుకు అనుగుణంగా రక్త సేకరణ జరగాలన్నారు. సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చునని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. రక్తదానం చేస్తే బలహీనపడి నీరసించిపోతారని, విపరీతమైన నొప్పి ఉంటుందని, రక్తదానం వల్ల ఎయిడ్స్ సంక్రమించవచ్చుననే ఒక అపోహా ఉందని ఇది అవాస్తవం అన్నారు. వాస్తవానికి రక్తదానం పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన పద్దతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా రక్త సేకరణ ఉంటుందని ప్రతిఒక్కరు ఆలోచన చేసి మహా పుణ్య కార్యక్రమానికి ముందుకు రావాలి జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆధిత్య తెలిపారు.
@ ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు.
@ రక్త ధాతలు, రక్తధాత ప్రోత్సాహకులు 70 మందికి జ్ఞాపికలు, శాలువాలు కప్పి జిల్లా జాయింటు కలెక్టరు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా.యం. యస్.వి.శివరామ భద్రిరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వేంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి భాను నాయక్, కోశాధికారి కలిదిండి తిరుపతి రాజు, సీనియరు కో ఆర్డినేటరు యస్. మల్లేశ్వర రావు, సీనియరు లైఫ్ సభ్యులు గోపిశెట్టి మురళీ కృష్ణా రావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, రక్త దాతలు, రక్తదాత ప్రోత్సాహకులు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in