విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ఏర్పాటు
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ-ముంబై సర్వీసు ప్రారంభం
ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి వల్లభనేని బాలశౌరి
*వ్యాపారస్తులకు ఇది శుభ పరిణామం*
*మెరుగైన ఎయిర్ సర్వీస్ లు తెచ్చేందుకు కృషి*
*గన్నవరం:- అమరావతికే తలమానికంగా ఉన్న విజయవాడ ఎయిర్ పోర్ట్‌ను మరింత అభివృద్ది చేసే విధంగా కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎయిర్ పోర్ట్ అథారిటీ వైస్ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పారు. విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో ఎయిరిండియా సర్వీసు విజయవాడ నుంచి ముంబైకి ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసును ఎయిర్ పోర్ట్ అథారిటీ చైర్మన్ హోదాలో ఎంపి వల్లభనేని బాలశౌరి, ఎయిర్ పోర్ట్ అథారిటీ వైస్ ఛైర్మన్ హోదాలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కలిసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎయిర్ పోర్ట్‌లోని డొమిస్టిక్ టెర్మినల్‌లో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి వల్లభనేని బాలశౌరి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎమ్.లక్ష్మీకాంత్ రెడ్డి, ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర్ పార్థసారధితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రయాణీలకు బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విజయవాడ విమానాశ్రయం నుంచి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, అలాగే ఇంటర్నేషనల్ ప్లైట్ సర్వీసులు కూడా అందుబాటులో రానున్నాయని తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కి కూడా తెలపటం జరిగింది.. ఆ టెర్మినల్ పనులు త్వరత్వరగా పూర్తి చేసేందుకు రెండు మూడు రోజుల్లో సమీకా సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయటంతో పాటు దేశ విదేశాలతో విమాన సర్వీసుల కన్టెవిటీ పెంచే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో విధ్వంసం మాత్రమే జరిగింది. ఆ విధ్వంసంలో భాగంగానే కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులు రద్దు చేయటం జరిగింది.గతంలో సింగపూర్ కి ఇక్కడి నుంచి డైరెక్ట్ విమానం వుండేది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ది చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ముందుగా ఎయిరిండియా సంస్థ ద్వారా విజయవాడ-ముంబై కి ఇక్కడ నుంచి విమాన సర్వీసులు పునరుద్దరించారు. ఇందుకోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ చైర్మన్, ఎంపి బాలశౌరి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని వ్యాపారస్తుల అవసరాల గుర్తించి ఈ సర్వీసులు ప్రారంభమయ్యేందుకు సహకరించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపి బాలశౌరి, ఎయిరిండియా సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. అంతకంటే ముందు ఎంపి బాలశౌరి మాట్లాడుతూ విజయవాడ -ముంబై విమాన సర్వీసు వల్ల ఎంతో మంది ప్రయాణీకులకి ఉపయోగంగా వుంటుందన్నారు. ఆర్థిక రాజధాని అయిన ముంబైకి రెండుగంటల్లో చేరుకోవచ్చునని తెలిపారు. వ్యాపారస్తులకి ఈ సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా వుంటుందన్నారు. కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్టీఆర్ జిల్లా టి.ఎన్.ఎస్.ఎఫ్. ప్రధాన కార్యదర్శి పి.సాయి చరణ్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహ్మాద్ తమీమ్ హన్సన్ తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in