Bhimavaram 24 వ తేదీ (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)ప్రారంభం ..
జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కర్ రావు
భీమవరం: జూన్ 23,2024
ఈనెల 24 వ తేదీ సోమవారం భీమవరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిఆర్ఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in