Bhimavaram:భీమవరం: జూన్ 24,2024. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు జిల్లా అధికారులకు సూచించారు …
సోమవారం స్థానిక కలెక్టరేటు సమావేశ మందిరము నందు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, కె.ఆర్.ఆర్.సి డిప్యూటీ కలెక్టరు బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కెసిహెచ్ అప్పారావుతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదును ముందుగా క్షుణ్ణంగా చదివి ఖచ్చితమైన పరిష్కారాన్ని వేగవంతంగా చూపాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, స్వంత సమస్యలా భావించినప్పుడే అది సాధ్యం అన్నారు. ఎప్పటికప్పుడు పెండింగు లేకుండా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు తెలిపారు.
ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో 86 ఫిర్యాదులను ప్రజల నుండి స్వీకరించడం జరిగింది.
@ అడ్డగర్ల వేంకటేశ్వర రావు ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామ నివాసి. నా కుమారుడు అడ్డగర్ల సంజీవ్ వ్యవసాయ భూమి అనుకుని ఉన్న పంట బోదే గట్టున ఏడు సంవత్సరాలు నుండి కొబ్బరి,ఇతర మొక్కలు పెంచుకుంటున్నాడు. కొంతమంది వ్యక్తులు వాటిని తొలగించినారు. వారిపై చర్యలు తీసుకుని, మొక్కలు పెంచుకునుటకు అనుమతి మంజూరు చేయవలసిందిగా కోరియున్నారు.
@ మోకా పార్వతి భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామ గ్రామ నివాసి. నాకు ప్రమాదవశాత్తు చెయ్యి విరిగింది. నిరుపేద కుటుంబం నాకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేసినా కుటుంబానీకి న్యాయం చేయాలని కోరారు.
@ పి. వెంకటసత్య గోపాల కృష్ణంరాజు ఉండి మండలం యండగండి గ్రామ నివాసి. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా నా ధాన్యం సొమ్మును ఇప్పించవలసిందిగా కోరినారు.
@ వీరవల్లి సాయిరామ్ ఉండి మండలం ఎన్ఆర్ పి అగ్రహారం గ్రామ నివాసి. నా పంట భూమి ఆన్లైన్ లో వేరే వారి పాస్ బుక్కు చూపెడుతుంది. సరి చేయగలరని కోరారు
@ వంగూరి ధనరాజు పెంటపాడు మండలం రావిపాడు గ్రామ నివాసి. నాకు 82 సెంట్లు వ్యవసాయ భూమి కలదు. నిరుపేద కుటుంబం. ప్రక్క రైతులు రొయ్యలు చెర్వులు తవ్వి ఉప్పునీరు పెట్టుట వలన మా పంట భూమి నాశనం అవుతున్నది. మిగతా రైతులు పరిస్థితి కూడా ఇదే. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కె.సి.హెచ్. అప్పారావు, కెఆర్ సి డిప్యూటీ కలెక్టరు బి. శివనారాయణ రెడ్డి, జిల్లా వివిధ శాఖల అధికారులు, వయోవృద్ధుల అప్పిలేటు ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in