దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అంబరాన్నంటిన ఫించన్లు పంపిణీ సంబరాలు…
పెదపాడు మండలం కొత్తూరులో గ్రామీణ పండుగను తలపించిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమం – హామీల అమలుతో లబ్ధిదారుల మొహాల్లో వెల్లివిరిసిన ఆనందాలు…
ముఖ్యతిధులుగా పాల్గొని స్వయంగా ఫించన్లు పంపిణీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్…
భారీ గజమాలలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు,స్థానిక నాయకులు…
జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్…
జిల్లా కలెక్టర్ ను సైతం ముగ్ధురాలిని చేసిన కొత్తూరు గ్రామ ప్రజల అభిమానం…
ఏలూరు/పెదపాడు,జూలై 1:ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3నెలల ఫించన్ డబ్బుతో కలిపి 7000/- రూపాయలతో పాటు పెంచిన ఇతర ఫించన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయటం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం పెదపాడు మండలం కొత్తూరు లో ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం రూ. 7వేలు అందజేయడం పట్ల పింఛను లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నరన్నారు.
అర్హులైన పేదలకు చెందాల్సిన డబ్బును పక్క దారి పట్టిస్తూ, సామాజిక ఫించన్లు విషయంలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల క్రింద 2,68,353 మందికి రూ.182.73 కోట్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.సోమవారం సాయంత్రం నాటికి నూరు శాతం పూర్తి చేయాలనే దిశగా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జన సేన ఇంచార్జీ ఘంటసాల వెంకట లక్ష్మి, జన సేన నాయకులు కొటారు ఆదిశేషు, బిజెపి అధ్యక్షులు కడగంచి శ్రీనివాసరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, మాజీ ఎంపిపి మోరు శ్రావణి దశరథ్, మాజీ జడ్పీటీసీ గారపాటి రామ, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాం ప్రసాద్, తాతా సత్యనారాయణ, పెదవేగి దెందులూరు, ఏలూరు రూరల్ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి నారాయణ ప్రసాద్, నంబూరి నాగరాజు సహా పార్టీ నాయకులు గుత్తా అనిల్, కొత్తూరు చినబాబు, కాశీ విశ్వనాథము, ఎంపిటిసి పల్లపోతు శ్రీనివాస రావు, డి అర్ డి ఎ పిడి ఆర్.విజయరాజు, ఎంపిడిఓ తేజ రతన్, తహశీల్దార్ భావనారాయణ సహా పలువురు టిడిపి బిజెపి జన సేన నాయకులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in