NTR Bharosa:భీమవరం: జూలై 1,2024 పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణంలో నేడు ఉదయం 6 గంటలకే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ
జిల్లాలో 2,32,885 మంది పెన్షన్ దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై నెలకు రూ.155.71 కోట్లు పింఛన్లు పంపిణీ..
రాత్రి 7.00 గంటల వరకు 95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి.. కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ..
జూలై 1 నుండి రూ.4,000/- లు పెన్షన్.. ఏప్రిల్, మే, జూన్ ఏరియల్స్ తో రూ.7,000/- లు అందజేత..
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో ప్రతి పేదవాని ఇంట్లో పండుగ వాతావరణం…
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు .. జిల్లా కలెక్టర్ సి. నాగరాణి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ..
.. నియోజకవర్గాల వారీగా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆచంట పితాని సత్యనారాయణ, భీమవరం పులవర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఆరు మిల్లి రాధాకృష్ణ, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉండి కె.రఘురామ కృష్ణంరాజు ..
ప్రజలకిచ్చిన తొలి హామీ నేటి నుండి అమలు ..
.. జిల్లా కలెక్టర్ సి. నాగరాణి
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం క్రింద సామాజిక పెన్షన్ లు పంపిణీ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అవ్వ,తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఎదురుచూస్తున్న పెన్షన్ల పండుగ రానే వచ్చింది. పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేలా పెన్షన్ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచి అందించడంతో లబ్ధిదారుల మనసుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నడూ లేని విధంగా పెన్షన్ అందుకుంటున్న సమయంలో వారి మొహాలు చిరునవ్వుతో వెలిగిపోయాయి. అర్హులైన లబ్ధిదారులు ఒకేసారి 7 వేల రూపాయలు అందుకోవడంతోపాటు, దివ్యాంగులు, తీవ్ర వ్యాధిగ్రస్తులు తదితరులకు పెన్షన్లు ఎక్కువ మొత్తంలో పెరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉంది…
రాష్ట జల వనరుల శాఖామంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజవర్గంలోని పెద్ద మామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట, అడవి పాలెం, కొంతేరు, వెస్ట్ కాజా, జిన్నూరు, మాటపర్రు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక వృద్ధ మహిళకి పెన్షన్ అందజేసిన అనంతరం గౌరవంగా ఆమె కాళ్లు కడిగారు. పలువురు లబ్ధిదారులకు మిఠాయిలు అందిస్తూ, తినిపిస్తూ.. మోటారు సైకిల్ ను వారే స్వయంగా నడుపుకుంటూ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ల నగదను అందజేయడం ఒకింత ఆశ్చర్యమైన విషయం కాగా.. లబ్ధిదారులకు ఎంతో సంతోషకరమైన విషయంగా ఉంది.
జిల్లా కలెక్టర్ సి.నాగరాణి పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదువల్లి ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేకువజామునే పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్ నగదును స్వయంగా అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో పెన్షన్ నగదును సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు బాసటగా నిలిచేందుకే పింఛన్ల మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో పెంచడం జరిగిందని ఈ సందర్భంగా లబ్ధిదారులకు తెలిపారు.
ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ.. ఆచంట, కొడమంచిలి, ఆచంట వేమవరం, గుమ్ములూరు, పోడూరు, కవిటం గ్రామాల్లో ఏర్పాటుచేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భీమవరం శాసనసభ్యులు పులవర్తి ఆంజనేయులు.. తాడేరు, మత్స్యపురి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ .. కృష్ణాయ పాలెం, అల్లంపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ .. వేల్పూరు, రేలంగి, అత్తిలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్.. పాతపాడు, రామన్నపాలెం, మొగల్తూరు-2, కొట్టాట, సేరేపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు .. ఎన్ ఆర్ పి అగ్రహారం, వేండ్ర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మా ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని, పేదలకు నిరంతరం వెన్నుదన్నుగా ఉంటామని అన్నారు. గతంలో ఎన్నడు కనివిని ఎరుగున రీతిలో పెన్షన్లు మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచడం జరిగిందని, పేద ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చే అంతగా పెన్షన్లను అందజేయడం జరుగుచున్నదన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in