Eluru: ఏలూరు, జులై, 2 : జిల్లాలో అపారిశుధ్యం, కలుషిత నీరు కారణంగా ఎక్కడైనా డయేరియా, విష జ్వరాల కేసులు నమోదు అయితే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం జిల్లాలో శానిటేషన్, త్రాగునీరు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో కలిసి మునిసిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాల సీజన్ లో పారిశుధ్యం, త్రాగునీరు, దోమల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రేకరించాలన్నారు. ప్రజల సమస్యలు నమోదు కోసం ఏర్పాటుచేసిన 9491041188 నెంబర్ కు శానిటేషన్, దోమల సమస్య, త్రాగునీటి కలుషితం పై పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, ఎక్కడా డయేరియా కేసులు నమోదు కాకుండా పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా డయేరియా కేసులు నమోదు అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. పట్టణ ప్రాంతంలో మునిసిపల్ కమిషనర్లు, గ్రామ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్సులు, ఈఓ పిఆర్డీలు ఉదయం 6 గంటల నుండే హాజరై పారిశుధ్య పనులు పర్యవేక్షించాలన్నారు. తాను పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా అధికారుల అలక్ష్యం కారణంగా డయేరియా కేసులు నమోదైతే వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు అన్ని శుభ్రం చేయాలనీ, క్లోరినేషన్ అనంతరమే త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. ఎక్కడైనా త్రాగునీరు పైప్ లైన్లు వద్ద డ్రైనేజ్ పైప్ లైన్లు లీకేజి కారణంగా త్రాగునీరు కలుషితం అవుతుందని, అటువంటివి గుర్తించి త్రాగునీరు కలుషితం కాకుండా వెంటనే లీకేజ్ లు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీలలో మురుగు నీరు నిల్వ లేకుండా సిల్ట్ తీసి, ప్రతీ రోజు శుభ్రం చేయించాలని, అనంతరం దోమల నిర్మూలనకు మలాథియాన్, అబెట్ చెల్లించాలన్నారు. ప్రతీ పట్టణ , గ్రామ ప్రాంతాలలో దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయించాలన్నారు. రోడ్లపై వర్షపు నీరు, చెత్త నిల్వ లేకుండా పారిశుధ్య కార్మికులతో ప్రతీ రోజు శుభ్రం చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్సులు తప్పనిసరిగా వారు పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉండాలన్నారు. శానిటేషన్, కలుషిత త్రాగునీరు, దోమల సమస్యలపై ప్రతీరోజు దినపత్రికలలో ప్రచురించబడే వార్తాంశాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను రిజాయిండర్ గా పత్రికల వారికి పంపాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఆర్ డబ్ల్యూ ఎస్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in