Eluruదత్తత పొందిన పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అన్ని హక్కులూ అందుతాయని, దత్తత తీసుకున్న పిల్లలను సొంత బిడ్డలు గానే పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తు నీ అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి కోరారు. స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం కుమారి మరియమ్మ కొత్త పేరు ప్రసన్న ప్రియ అను 12 సం ల పాప ను రాజమణి అను పాలకొల్లు కు చెందిన ఆమెకు, గణేష్ కొత్త పేరు గణేష్ శాస్త్రి అను 11 సం ల వయస్సు కలిగిన బాలుడిని రవికుమార్ ఉష దంపతులు కు ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో దత్తత అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెద్ద పిల్లల ను కూడా దత్తత తీసుకోవటం అభినందనీయమని, దత్తత కు తీసుకున్న బాలలను తల్లిదండ్రులు వారికి పుట్టిన సొంత బిడ్డలు గానే చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి కె పద్మావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి హెచ్ సూర్య చక్ర వేణి, శిశుగృహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in