Eluru/కుక్కునూరు, జూలై 07… ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానం సోమవరం నుండి అమల్లోకి రానున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి చెప్పారు.
ఆదివారం కుక్కునూరు మండలం వింజరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ ను సందర్శించి ఇసుక లభ్యతను పరిశీలించారు. సోమవరం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు అందుబాటులో నిల్వలను అంచనా వేసి రెవిన్యూ శాఖకు అప్పగించాలని సాంకేత సిబ్బందికి సూచించారు. ఉచిత ఇసుక సరఫరా విధానానికి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయన్నారు. ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల సోమవారం నుంచి ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం, స్టాట్యూటరీ చార్జీలను, మెట్రిక్ టన్నుకు లోడింగ్ చార్జీలు, రూ. 30/-లు, సీనరేజి చార్జీలు రూ. 88/-లు ఉంటాయని దీనికి అధనంగా జిఎస్టీతో కలిసి మొత్తం రూ. 152/-లు వరకు ఉండవచ్చన్నారు. ఈ ధరలు ఆయా స్టాక్ పాయింట్ల వారీగా నిర్ణయించి ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు అనుసంధానంగా ఒకరోజుకి ఒకరికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించేందుకు తహశీల్దార్లను స్పెషల్ ఆఫీసర్లు ఉంచడం జరిగిందని వీరి వ్యక్తిగతంగా స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎవరు మొదటిగా వస్తే వారికి ముందుగా కేటాయించే పద్దతిలో ఇసుకను సరఫరా చేస్తారన్నారు. కుక్కునూరు మండలంలో ఇబ్రహీంపట్నం, వింజరం, దాచారం లలో, వేలేరుపాడు మండలంలో రుద్రంకోట -1, రుద్రంకోట-2 లలో ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయన్నారు. ఇసుక త్రవ్వకాలకు సంబంధించి పర్యావరణానికి ముప్పులేకుండా మాన్యూల్ గా జరుగుతుందన్నారు.
జాయింట్ కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె. అద్దయ్య, తహసీల్దార్ అచ్యుత్ కుమార్, స్ధానిక మండల అధికారులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in