Kukunoor: జూలై, 7:వరద ప్రభావితానికి గురయ్యే ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులను ముందస్తుగానే ప్రణాళిక బద్దంగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి ఆదేశించారు.
ఆదివారం కుక్కునూరు గిరిజన కో-ఆపరేటివ్ గోడౌన్ లో పిడిఎస్ స్టాక్ ను తనిఖీచేసి ఎఫ్ పి షాపుల వద్ద పిడిఎస్ రైస్ పొజీషనింగ్ ను పునరుద్దరించుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కుక్కునూరు మండలం కివ్వాక గ్రామం లోగల ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రాంతంలో ముందస్తుగానే నిల్వ ఉంచిన బియ్యం ఇతర నిత్యవసర వస్తువులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి మాట్లాడుతూ కుక్కునూరు మండలం కివ్వాక, తొండిపాక ,అమరవరం ,ఉప్పేరు ,కొండపల్లి,గోమ్మిగూడెం ,మెరుడుబాక ,దామరచర్ల ,చీరపల్లి దాచారం , ఇసుకపాడు ,నెమలి పేట తదితర గ్రామాలలో మరియు వేలేరుపాడు మండలం లో గల రుద్రంకోట ,మామిడి గొంది, కట్కూరు, భూదేవి పేట, కాకిసునూర్ మరియు ఇతర నిర్దేశించిన ఎత్తయిన ప్రదేశములలో చాలావరకు నిత్యవసర వస్తువులను మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ,కుక్కునూరు నుండి తరలించడం జరిగిందని, వరద ముప్పు ప్రాంతాలలో గల కార్డుదారులకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం నిత్యవసర వస్తువులను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. వరదలు సంభవించినప్పుడు కొన్నిచోట్ల రహదార్లు కొట్టుకుపోవుట, దెబ్బ తినటం , రవాణా స్తంభించే ప్రాంతాలలో ముందస్తు ప్రణాళికగా ఈ విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందని ఈ దృష్ట్యా కార్డుదారులు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరా అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు,జిల్లా పౌర సరఫరా సంస్థ , జిల్లా మేనేజర్, మంజు భార్గవి, రెవెన్యూ డివిజన్ అధికారి జంగారెడ్డిగూడెం కె. ఆదయ్య, కుక్కునూరు తాహశీల్దార్ అచ్యుత్ కుమార్, సి ఎస్ డి టి , ఇతర సిబ్బంది ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in