Bhimavaram:రెవెన్యూ లక్ష్యాలను నిర్ణిత గడువులో పూర్తి చేసేందుకు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి అన్నారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి.నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సంయుక్తంగా వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని తాహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాలైన కోర్టు కేసులకు సంబంధించి సరైన రీతిలో డిస్పోజలను దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసులు డిస్పోజల్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజా సేవకులుగా ఉన్న మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిబద్ధతతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. భూసేకరణ, 22ఎ, కమ్యూనిటీ సర్టిఫికెట్ లు జారీ, మీ కోసం ఫిర్యాదుల పరిష్కారం, పట్టాల సబ్ డివిజన్ లు, పాస్ బుక్కులు జారీ, ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలని , కొన్ని ఫైల్స్ లో జాప్యం ప్రజలకు అపోహను కలిగిస్తాయని, ఇటువంటివి వేరే సమస్యలకు దారితిస్తాయని తెలిపారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ల జారీకి త్వరితగతిన విచారణ పూర్తి చేసే సర్టిఫికెట్లు జారీ వేగవంతం చేయాలన్నారు. అలాగే మీకోసం ఫిర్యాదులు నిర్ణీత గడువులోపుగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఇంటింటికి రేషన్ సరఫరా చేసే ఎండియుల ద్వారా ఈ నెలలో బియ్యం ఒక్కటి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కందిపప్పు, పంచదార ఇటీవల గోడౌన్ ల పరిశీలనలో తూకం తగ్గుదల కారణంగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక బియ్యాన్ని మాత్రమే పంపిణీకి ఆదేశించియున్నారని తెలిపారు. ఎండియు వాహనాలలో తూనిక యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఒకసారి తనిఖీ చేయాలన్నారు. తేడాలుంటే ఆ మిషన్ స్థానంలో వేరొక తూని యంత్రాన్ని మార్పుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, కలెక్టరేట్ సెక్షన్స్ సూపరింటెండెంట్ లు, డిప్యూటీ తాహాసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in