Bhimavaram:మూగజీవాలకు అందించే సేవలలో ఎట్టి పరిస్థితుల్లో లోపం ఉండరాదని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు .
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖలో కొనసాగుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ మూగజీవాలకు ఉత్తమ సర్వీస్ ను అందించాలని, విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల పని వేళల్లో సిబ్బంది అందరూ కచ్చితంగా విధులకు హాజరు కావాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సబ్జెక్టు నాకు ఎంతో ఇష్టమైనదని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. లైవ్ స్టాక్ సెన్సెస్ ప్రకారం జిల్లాలో 2,23,676 ఆవులు, గేదెలు, 61,569 గొర్రెలు, 43,04,397 మేకలు, పందులు, బాతులు, నాటు కోళ్లు, బాయిలర్, ఫారం కోళ్ళు ఉన్నాయన్నారు. జిల్లాలో వెటర్నరీ ఇన్స్టిట్యూషన్స్ 318 ఉన్నాయని తెలిపారు. కాలానగుణంగా వ్యాప్తి చెందే వ్యాధులకు క్యాలెండర్ ప్రకారం వాక్సినేషన్ అందించాలని సూచించారు. 31 సెంటర్లలో టాయిలెట్స్ అవసరం ఉన్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చాలా హాస్పిటల్స్ మరమ్మత్తుల దశలో ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నిధులు మంజూరుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసవర్ధక శాఖ అధికారి డా.కె మురళీకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు డా.జవహర్ హుస్సేన్, డా.యల్.కె.సుధాకర్, డా.జి.జేసు రత్నం, టెక్నికల్ ఆఫీసరు నోయల్, సహాయ సంచాలకులు, ఏరియా పశు వైద్యశాలలో వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in