Bhimavaram:పశుసంక్రమిత వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పక వ్యాక్సినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు.
శనివారం ప్రపంచ పశు సంక్రమిక వ్యాధుల నివారణ దినం (ప్రపంచ జునోసిస్ దినోత్సవం) సందర్భంగా భీమవరం పశువుల ఆసుపత్రి నందు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి.నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు. 1885 జూలై 6 న లూయీ పాశ్చర్ అనే శాస్త్ర వేత మొదటి సారిగా పిచ్చి కుక్క కాటుకు గురైన 9 ఏళ్ళ బాబుకి రేబిస్ వ్యాధి రాకుండా తనుకనుగొన్న వ్యాధినిరోధక టీకాలను విజయవంతముగా అందించడం జరిగిందన్నారు. దీనికి చిహ్నంగా జులై 6 పశు సంక్రమిక వ్యాధుల నివారణ దినం (జూనోసిస్ డే) గా పాటిస్తున్నామన్నారు. మన చుట్టూ మనతో పాటు మసలే పశు పక్ష్యాదులు జంతువుల వల్ల మేలుతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు. మన ఇంట్లో మనతో పాటు ఉండే కుక్క పిల్ల గాని మనకు తెలియకుండా తిరిగే ఎలుకవల్ల గాని మన రక్తని సైలెంట్ గా పిల్చే దోమ వల్ల గాని, పాలు ఇచ్చే గేదేల వల్లగాని, పౌష్టికా ఆహారం అందించే కోడి వల్ల గాని ప్రమాదం రావచ్చు అన్నారు. ఇటువంటి పలురకాల పశువులు, జంతువులు, కీటకాల వల్ల సుమారు 150 కి పైగా వ్యాధులు వస్తాయన్నారు. ఇందులో ప్రాణాపాయం కలిగించే వ్యాధులు ఉన్నయని, ఆ వ్యాధులు ఎమిటో ఎలా సంక్రమిస్తాయో, అవి రాకుండా మనం ఏమి చెయ్యాలో ప్రతి ఒక్కరు అవగాహన పొందాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ఈ వ్యాధుల వలన సుమారు 60,000 వేల మంది సంవత్సరానికి మన దేశంలో మరణినిస్తునారన్నారు. కోడి, పంది, కుక్క, ఆవు,గేదె, జింక, గొర్రెలు, ఎలుక తదితర జంతువుల నుండి వ్యాధుల సంక్రమించడం జరుగుతుందన్నారు. వ్యాధికారక క్రిములున్న పశు పక్ష్యాదులు సన్నిహితంగా మెలగడం, మల ముత్రాలు వల్ల మంచి నీటివనరులు కలుషితమవడం, పాలు, మాంసం, గుడ్లు, చేపలు మొదలగువాటిని సరియైన ఉష్ణోగ్రత వద్ద సరియైన పద్దతిలో ఉడికించక పోవడం వంటివి వ్యాధుల సంక్రమించేందుకు కారణాలుగా ఉంటాయన్నారు. వీటి నివారణకు పెంపుడు కుక్కలకు ఏ.ఆర్.వి వాక్సిన్ వేయించడం, పశు పోషకులు వాటి మల ముత్రాలు ఎప్పటికప్పుడు నిల్వ లేకుండా శుభ్రం చేయడం, పాలు, మాంసం, గుడ్లు మొదలగు ఆహారపదర్దాలు 70 C వద్ద 10 ని పై గా ఉడికించడం, పచ్చిపాలు త్రాగకుండా వుండటం, పెంపుడు కుక్కలను జంతువులను ఇంటి లోపల వంట గదులలో తిరగకుండా ఉంచడం, వర్షకలంలో పశువుల మల ముత్రాలు భుగార్భాజలలు కలుషితం చేసే అవకాశం ఉంది కాబట్టి నీటిని కాచి వడపోసి త్రాగదం, కుక్కలు కరిస్తే వెంటనే ఆ ప్రదేశాని సబ్బు తో కడిగి వైద్యుని సంప్రదించడం, కోళ్ళు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మేలగకుండా వుండటం, వ్యాధులు సంక్రమించిన జంతువులను పట్టుకునేటప్పుడు గ్లోవ్స్ ను ఉపయోగించడం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలన్నారు.
స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ యజమానులు పెంపుడు జంతువులను బయటకు వదలకుండా ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలన్నారు. పెంపకంతో పాటు అప్రమత్తత ఎంతో అవసరమని అన్నారు. అభిమానంతో పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి వంటి వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ ను వేయించాలని ఆయన అన్నారు. గేదెలు, ఆవులు,గొర్రెలు, మేకలు, నుండి కూడా ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున రైతులు వాటికి కూడా వ్యాక్సిన్లు వేయించాలని అన్నారు. పశువుల నుండి మనుషులకు వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు మనం పెంచుకునే జంతువులను ఆరోగ్యంతో ఉండేలా చూసుకోవాలని అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువుల వైద్యులలకు చూపించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
కార్యక్రమం చివరిగా జిల్లా జంతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమొంటోలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.కె.మురళీకృష్ణ, డిఎంహెచ్వో డా.డి.మహేశ్వరరావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల, జిల్లా జంతు సంక్షేమ సంఘం అధ్యక్షులు సుంకర దాసు , సభ్యులు చెరుకువాడ రంగసాయి, నరహరిశెట్టి కృష్ణ, పశు సంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in