Bhimavaram:బహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధరలు నియంత్రణకు అన్ని వర్గాల వర్తకులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి వి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్య రిటైల్ అమ్మకందారులతో సమావేశమై మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధర స్థిరీకరణఫై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉల్లిపాయలు, కూరగాయలుతో పాటు పప్పులు, బియ్యం, ఆయిల్ వంటి నిత్యవసర వస్తువుల అందుబాటులో లేని విధంగా రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయన్నారు. నిత్యవసర వస్తువులు భారం తగ్గించేందుకు వర్తకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖ, రైస్, పప్పులు, ఆయిల్, కూరగాయలు, రిటైల్ వ్యాపారస్తులకు ఉల్లి, టమాట ధరలు నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. రాబోయే వర్షాకాలం మరియు ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అందరు వర్తకులు వారి వద్ద ఉన్న స్టాక్స్ ని వెంటనే భారత ప్రభుత్వం వారి వెబ్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కొంతమంది వ్యాపారస్తులు నిత్యవసర వస్తువులు ఇష్టానుసారంగా విక్రయించడo జరుగుతుందని అలా జరగకుండా రిటైల్ అమ్మకందారులు సహకరించాలని కోరారు. మన జిల్లాకు దిగుమతి అయ్యే కూరగాయలు ఎక్కువగా ఏ ప్రాంతాల నుండి వస్తాయి అని వ్యాపారస్తులను జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల నుండి దిగుమతి అవుతున్నాయన్నారు. అలాగే క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంటివి ఇతర జిల్లాలు నుండి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ఎక్కువగా పండించే కూరగాయలను నేరుగా కొనుగోలు చేసి రైతు బజార్ లో ద్వారా అమ్మకాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ సునీల్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి.శివరాం ప్రసాద్, ఏ ఎస్ ఓ ఎం రవిశంకర్, వర్తక సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in