Bhimavaram:జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలకు ముందస్తు చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం స్థానిక కలెక్టరేట్ వి.సి హాల్ నుండి జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో నూతన ఇసుక పాలసీ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు నూతన ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నూతన పాలసీ విది విధానాలను సంబంధిత అధికారులు పూర్తిగా అవగాహన చేసుకొని అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. జిల్లాలో 6 ఓపెన్ రీచలు ఆచంట మండలంలో కరుగోరుమిల్లి, కోడేరు, పెనుగొండ మండలంలో సిద్ధాంతం-ఒన్ అండ్ టు, నడిపూడి-వన్ అండ్ టు ఉన్నాయన్నారు. 5 డీసీల్టేషన్ పాయింట్లు అబ్బిరాజుపాలెం, మాధవాయపాలెం, ఎలమంచిలి లంక, దొడ్డిపట్ల, చించినాడలలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఏ ఒక్క పాయింట్ లోను ఆపరేషన్ జరగడం లేదని తెలిపారు. అలాగే 6 ఇసుక స్టాక్ యార్డ్స్ భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, సిద్ధాంతం, కొడమంచిలి లో ఉన్నాయని తెలిపారు. ఇసుక త్రవ్వకాలకు అవసరమైన అనుమతులను పొందాల్సి ఉందని, ఇందుకు సంబంధించి గోదావరి హెడ్ వర్క్ స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా అనుమతులకు ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉందన్నారు. అన్ని డిసిల్టేషన్ పాయింట్లకు గోదావరి హెడ్ వర్క్ ఈ.ఈ కాశీ విశ్వేశ్వరరావును కస్టోడియన్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. అలాగే గుర్తింపు పొందిన బోట్స్ మెన్ సొసైటీల జాబితా సిద్ధంగా ఉంచాలన్నారు. థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ లకు పంచాయతీ సెక్రెటరీలను కస్టోడియంన్ గా నియమించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదు డీసిల్టేషన్ పాయింట్లతో పాటు, అనువుగా ఉన్న మరికొన్ని డీసిల్టేషన్ పాయింట్లను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని నరసాపురం ఆర్ డి ఓ కు సూచించారు. ఆరు స్టాక్ పాయింట్ లకు కస్టోడియం అధికారులుగా పోలీస్, రెవెన్యూ అధికారులను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జూన్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, సెబ్ అడిషనల్ ఎస్పీ ఏటివి రవికుమార్, జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి ప్రసాద్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in