Bhimavaram:ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు .
సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సి.నాగరాణి సంయుక్త కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె.ఉదయ భాస్కరరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులకు నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. కొన్ని శాఖల్లో ఫిర్యాదులు తిరిగి ఓపెన్ అవుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఓపెన్ కాకూడదన్నారు.
మొత్తం 179 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
- ఉండి మండలం ఎన్ ఆర్ పి అగ్రహారం, మహదేవపట్నం, గ్రామాలకు సంబంధించిన 500, ఎకరాల ఆయకట్టు చెందిన మురుగునీరు ప్రవహించే మురుగు కాలువ మరియు రక్కీసు కోడును ఎన్ ఆర్ పి అగ్రహారం గ్రామo బీసీ, ఎస్సీ కాలనీల నివాసాలు ఉంటున్న ప్రజలు మురుగు కాలవ గట్టును ఆక్రమించుకుని గృహములు నిర్మించడం వలన కాలువలో నానా వ్యర్థములు పాడవేయడం వల్ల కాలువ పూర్తిగా పూడికపోయినది, దీని కారణంగా మా పంట పొలాలు నీట మునిగి చాలా నష్టము పోవు చున్నామని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు పెదపాటి వెంకటేశ్వరరావు, బిహెచ్ హరినాధరాజు, కడలి శ్రీనివాస్, తదితరులు కోరారు.
- సంవత్సర కాలంగా పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకున్న అధికారులు పట్టించుకోవటం లేదని, పింఛను మంజూరు చేయాలని పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి ట్రాన్స్ జెండర్ చలుమూరి పావని (బుజ్జి) కోరారు.
- వీరవాసరం మండలం వీరవాసరం నుండి బొంతు పెద్దిరాజు తన పేరును ఉన్న ఇంటి పన్నును తన ఇద్దరు కుమారుల పేరున మార్చమని పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న పట్టించుకోవడం లేదని, తగిన పరిష్కారం చూపాలని కోరారు.
- భీమవరం మండలం తుందురు గ్రామం నుండి పెన్నమరాజు శ్రీదేవి తన భర్త చనిపోయి మూడు సంవత్సరములు అయినదని, ఆధారం ఏమీ లేదని పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు సి వి. ప్రవీణ్ ఆదిత్య, డి ఆర్ ఓ జె.ఉదయ భాస్కరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in