Bhimavaram:మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాలులో జిల్లా జాయింటు కలెక్టరు సంబంధిత అధికారులు, రిటైల్ అమ్మకందారులతో సమావేశమై బహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధర స్థిరీకరణఫై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల యొక్క ధరల పెరుగుదలను నియంత్రించుటలో భాగంగా, జిల్లాలోని అన్ని రైతు బజార్లు,డి మార్టు, రిలయన్స్, సూపరు మార్కెట్లల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, రేట్లు వివరాలను అందరికీ కనబడేలా బోర్డులను డిస్ప్లే చేయాలన్నారు.బియ్యం, కందిపప్పును ప్రజానీకానికి మార్కెటు ధరల కంటే తక్కువ ధరకు అమ్మకాలు చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు ఆదేశించారు. అట్టి ప్రత్యేక కౌంటర్లలో అమ్మే బియ్యం మరియు కందిపప్పు వివరాలు ఈ క్రింద విధంగా తెలియ జేశారు.1) స్టీమ్ రకం బియ్యం – కిలో ఒక్కింటికి రూ 49/- , 2) ముడి రకం బియ్యం – కిలో ఒక్కింటికి రూ. 48/-, 3) కందిపప్పు (దేశవాళి) – కిలో ఒక్కింటికి రూ. 160/- అమ్మకాలు జరగాలని ఆదేశించారు.జిల్లాల్లో పప్పుల వ్యాపారం చేస్తున్న అందరు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులు ఈ నెల 12 వ తేదీ లోగా వారి వద్ద ఉన్న అన్ని రకాల పప్పుల నిల్వలను భారత ప్రభుత్వం వారి వెబ్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు మార్కెటింగు, సివిల్ సప్లై శాఖ, రైస్, పప్పులు, ఆయిల్, కూరగాయలు, రిటైల్ వ్యాపారస్తులకు ఉల్లి, టమాట ధరలు నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు.రాబోయే వర్షాకాలం మరియు ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది వ్యాపారస్తులు నిత్యవసర వస్తువులు ఇష్టానుసారంగా విక్రయించడo జరుగుతుందని అలా జరగకుండా, ప్రజలకు మంచిచెయ్యాలని సేవాతత్వం అమ్మకదారులకు ఉండాలని జిల్లా జాయింటు కలెక్టరు సి.వి. ప్రవీణ్ ఆదిత్య కోరారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వేంకటేశ్వర రావు, డియస్ వో యన్.సరోజ, సివిల్ సప్లై జిల్లా మేనేజరు టి.శివరామ ప్రసాదు, డియార్డీఏ పిడి యం.యస్.యస్.వేణుగోపాల్, ఏయస్ వో యం.రవిశంకర్, రైతు బజార్లు ఎస్టేటు అధికారులు,వర్తక సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in