Eluru:జూలై 10:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల నియంత్రణలో భాగంగా బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి జిల్లాలో గల రైస్ మిల్లర్, హోల్ సేల్ బియ్యం, పప్పు దినుసుల, పంచదార వర్తకుల యాజమాన్యం ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ యాజమాన్యములతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బహిరంగ మార్కెట్ కంటే బియ్యం కందిపప్పు పంచదార అన్ని కూడ చౌక ధరలతో ప్రజలకు అందుబాటులో ఇచ్చుటకు జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ క్రింది విధముగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
- కందిపప్పు (దేశవాళీ వెరైటీ ) @కేజీ Rs.160/-
(బహిరంగ మార్కెట్ ధర కేజీ Rs.181/- ) - బిపిటి/సోనా మసూరి –ఫైన్ రైసు (స్టీము) @కేజీ Rs.49/-
(బహిరంగ మార్కెట్ ధర .55.85Ps.). - బిపిటి/ సోనా మసూరి –ఫైన్ రైసు (రా రైసు) @కేజీ
Rs.48/-
(బహిరంగ మార్కెట్ ధర.52.40Ps. )
రైతు బజారు , ఫతేబాద,ఏలూరు, రైతు బజారు , ఏలూరు 1 వ టౌన్
రైతు బజారు , కైకలూరు
రైతు బజారు , నూజివీడు
కిరాణా అసోసియేషన్ , మెయిన్ రోడ్డు , జంగారెడ్డిగూడెం , శ్రీ . లలిత సాయి మిత్ర ట్రేడర్స్ , చింతలపూడి
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి మాట్లాడుతూ ధరల నియంత్రణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకొనటం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ దేశాల మేరకు ప్రతిరోజు పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణ జరిగే విధంగా చర్యలు తీసుకొనటం జరుగుతుందన్నారు.
సమావేశానికి జిల్లా పౌర సరఫరా అధికారి ఎస్ ఎస్ సత్యనారాయణ రాజు,డి యం సివిల్ సప్లైస్ మంజుబార్గవి, వై. ప్రతాపరెడ్డి, ఏ ఎస్ ఓ, మరియు వర్తక సంఘ ప్రతినిధులు, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ సువేరా ప్రసాద్ ఇతరులు హాజరై య్యారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in